Atchannaidu: జగన్ పార్టీ అధికారంలో ఉండేది ఇక 8 మాసాలే...
ABN , First Publish Date - 2023-04-05T13:14:20+05:30 IST
విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) రాష్ట్రానికి పట్టిన శని అని, ఒక సైకో (Psycho) ఏపీకి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చాన్నాయుడు (Atchannaidu) అన్నారు.
విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) రాష్ట్రానికి పట్టిన శని అని, ఒక సైకో (Psycho) ఏపీకి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చాన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పార్టీ (Jagan Party) అధికారంలో ఉండేది ఇక 8 మాసాలేనని అన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ప్రజలకు ఆశలు కల్పించి మోసం చేశారని విమర్శించారు. ఏపీలో టీడీపీ (TDP) లేకుండా చేయాలని ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదని.. కానీ ధైర్యంగా నిలబడ్డామని... దేనికీ లొంగలేదని అన్నారు.
వైసీపీలా టీడీపీ గాలికి పుట్టిన పార్టీకాదని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 స్ధానాలు గెలుచుకోవడం ఖాయమని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని గాడిలో పెట్టగలిగే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. ‘బటన్ నొక్కడానికే ఉన్నాను... మీరు కష్టపడండి’ అని సిగ్గులేకుండా జగన్ చెబుతున్నారని మండిపడ్డారు. సంపదను సృష్టించి పేదలకు పంచాలని.. కేవలం బటన్ నొక్కడం గొప్పతనం కాదన్నారు.
ఐదు కోట్ల మంది ఆంధ్రులు సైకో పాలన పోవాలని కోరుకుంటున్నారని.. జగన్ పిల్లికంటే హీనంగా మారారని.. ఎమ్మెల్యేలను బతిమాలుకుంటున్నారని.. అదే మన మొదటి విజయమని అచ్చెన్నాయుడు అన్నారు. పులివెందుల (Pulivendula)లో కూడా టీడీపీ జెండా ఎగరవేసిందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానిగా కోరుకోవడం లేదని.. వెనుకబాటు తనాన్ని దూరం చేయాలని కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు మరింత భాధ్యతను పెంచిందన్నారు. గతంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించు కాలేదని.. ఈసారి కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.