Ganta Srinivas Rao: ఎన్నికలు, పొత్తులపై గంటా కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-12T14:19:31+05:30 IST
ఎన్నికలు, పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: ఎన్నికలు, పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former minister Ganta Srinivas Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల (Telangana Elections) మీద ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ, జనసేన, సీపీఐ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాయని చెప్పారు. బీజేపీ ఎంత వరకు కలిసి వస్తుందనేది కాలం నిర్ణయిస్తుందని తెలిపారు. వైసీపీకి ఇంటికి పంపించాలనే లక్ష్యంతో పని చేసే పార్టీలన్నీ కలుస్తాయన్నారు. జాతీయ పార్టీ అధి నాయకత్వం ఏమి చెబితే పురంధేశ్వరి (AP BJP Chief Purandeshwari) అదే చేస్తారని.. వైసీపీవి అర్థం లేని ఆరోపణలు అని మండిపడ్డారు. విశాఖకు సీఎం జగన్ (CM Jagan) వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ దొంగ జీఓ విడుదల చేసిందని.. జీఓ ఇచ్చిన అధికారులు సిగ్గు పడాలన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తురావడం హాస్యాస్పదంగా ఉందని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.