Share News

Ganta Srinivasrao: ఎప్పుడు డీఎస్సీ... ఇంకెప్పుడు నోటిఫికేషన్ జగనన్న..

ABN , First Publish Date - 2023-11-23T10:46:07+05:30 IST

Andhrapradesh: నెలలు గడిచిపోతున్నా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు.

Ganta Srinivasrao: ఎప్పుడు డీఎస్సీ... ఇంకెప్పుడు నోటిఫికేషన్ జగనన్న..

విశాఖపట్నం: నెలలు గడిచిపోతున్నా డీఎస్సీ నోటిఫికేషన్‌ను (DSC Notification) ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivasrao) విరుచుకుపడ్డారు. ‘‘ఎప్పుడు డీఎస్సీ... ఇంకెప్పుడు నోటిఫికేషన్ జగనన్న. మన రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్‌.. ‘మళ్లీ మళ్లీ పెళ్లి’ డైలాగును తలపిస్తోంది. అదిగో డీఎస్సీ... ఇదిగో డీఎస్సీ.... అంటూ విద్యాశాఖ మంత్రి గారు మీడియా ముందు గొప్పలు... ఆ తర్వాత ఆ ఊసే ఉండదు. మొన్నటికి మొన్న వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ అన్నారు. ఆ వారాలన్నీ దాటిపోయి నెలలు గడుస్తున్నాయి మంత్రిగారు. మెగా డీఎస్సీని కాస్త మినీ డీఎస్సీ చేశారు ఇప్పుడు దీనికి కూడా మోక్షం కలిగేలా లేదు. మంత్రి గారి మాటలు ‘ ఒట్టి విస్తరాకు మంచి నీళ్ళే’ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి నోటిఫికేషన్ల గారెడీతో నిరుద్యోగులను మరో మోసానికి తెర తీశారు తప్ప ఇంకోటి కాదు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అన్నారు...! ఆ తర్వాత ఏడాదికి ఒక డీఎస్సీ అన్నారు....! గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారు..! మీకు అసలు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన ఉందా..? లేఖ ఇది కూడా మీ మ్యానిఫెస్టోలో రాలిపోయే రత్నం గానే మిగిలిపోతుందా..? ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ కొందరు నిరుద్యోగులకు వయసు రీత్యా అనర్హులవుతున్నారనే సంగతి గాలికొదిలేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఉద్యోగం కోసం వేలాది మంది నిరుద్యోగులు రొడెక్కి. ఉద్యమాలు చేస్తున్న మీలో చలనం లేదు. నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో... 9,061 పోస్టులతో, 2018లో... 7,729 పోస్టులతో మెగా డీఎస్సీలు ప్రకటించి వేలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు ముఖ్యంగా డీఎస్సీ అభ్యర్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదు. 2024లో రానున్నది చంద్రన్న పాలనే. రాష్ట్రంలో అన్ని శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి మళ్ళీ మీ కుటుంబాలలో వెలుగులు నింపేది కూడా చంద్రన్న ప్రభుత్వమే’’ అని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Updated Date - 2023-11-23T11:00:15+05:30 IST