Ganta Srinivasa Rao: జగన్ విశాఖ వస్తారని అనుకోవడం లేదు
ABN , First Publish Date - 2023-06-26T16:37:39+05:30 IST
వ్యాపారవేత్తలు గానీ పారిశ్రామికవేత్తలు గానీ విశాఖ రావాలంటే భయపడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే
విశాఖ: వ్యాపారవేత్తలు గానీ పారిశ్రామికవేత్తలు గానీ విశాఖ రావాలంటే భయపడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao ) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే సామాన్యులకు రక్షణ ఉన్నట్లా? ఇది విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడం కాదా?, కిడ్నాప్ ఘటన చూసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN) విశాఖ వస్తారని అనుకోవడం లేదు. విశాఖలో సెటిల్మెంట్లు, దందాలు, అక్రమాలు పెరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటన తర్వాత కూడా విశాఖలో లా అండ్ ఆర్డర్ బాగుందని డీజీపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జరుగుతున్న ఘటనకు మూలాలను వెతకడం లేదు. గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. విశాఖలో చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.’’ అని గంటా చెప్పుకొచ్చారు.