Ganta Srinivasa Rao: ఓటమిని భరించలేక వైకాపా రౌడీయీజం...

ABN , First Publish Date - 2023-03-20T14:25:36+05:30 IST

విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని భరించలేక వైకాపా నేతలు ఇలాంటి రౌడీయీజంకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

Ganta Srinivasa Rao: ఓటమిని భరించలేక వైకాపా రౌడీయీజం...

విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని భరించలేక వైకాపా నేతలు ఇలాంటి రౌడీయీజంకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ట్విట్టర్ (Twitter) వేదికగా విమర్శలు చేశారు. అసెంబ్లీ (Assembly) చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు. దళిత ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి (Dola Veeranjaneya Swamy), గోరంట్ల బుచ్చియ్య చౌదరి (Gorantla Buchaiah Choudhary)పై వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) దాడి చేయడం దుర్మార్గమైన చర్యకు ఇది పరాకాష్టని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. స్పీకర్ (Speaker) సాక్షిగా ఎమ్మెల్యేపై దాడి జరిగిందని, జరిగిన ఘటన సభాపతి వీడియో బయటకు రిలీజ్ చెయ్యాలన్నారు. దాడిచేసినా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు ఢిమాండ్ చేశారు.

కాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు (Sudhakar Babu) దాడి చేసి.. స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampally Srinivas) టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డ్ లాక్కోని నేట్టేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కింద కూర్చోని నిరసన చేపట్టారు. జీవో నంబర్1రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను ముట్టడించారు. దీంతో స్పీకర్ చైర్ దగ్గరకు వెళ్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు.

Updated Date - 2023-03-20T14:25:36+05:30 IST