Ganta Srinivasarao: రైతుల కష్టాలు కనపడటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు..?

ABN , First Publish Date - 2023-05-12T15:41:48+05:30 IST

విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ట్విట్టర్ (Twitter) వేదికగా వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై విమర్శలు గుప్పించారు.

Ganta Srinivasarao: రైతుల కష్టాలు కనపడటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు..?

విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ట్విట్టర్ (Twitter) వేదికగా వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పండించిన పంట కళ్లెదుటే తడిసి ముద్దవుతుండడంతో కన్నీరు మున్నీరవుతున్న రైతుల కష్టాలు మీకు కనపడటం లేదా జగన్మోహన్ రెడ్డి గారు..? మీ ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదు.. కనీసం రైతుల సమస్యలు వినడానికైనా ప్రయత్నం చేయాలి కదా...? మీ మంత్రి ఒక జోకర్‌లాగా ధాన్యం మొలకెత్తితే నేనేమి చెయ్యాలి నోరుమూసుకో "ఎర్రిపప్ప" అని రైతును దుర్భాషలాడటం, మీ పనితీరుకు ఇదే నిదర్శనం’’ అంటూ ట్వీట్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటన, ఆయన ప్రసంగాలకు అడుగడుగునా అడ్డు తగిలేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు వైసీపీ నేతలను (YCP Leaders) ఉద్దేశించి ప్రశ్నించారు. రైతులు పడుతున్న బాధలు చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), వామపక్ష నాయకులు రైతుల పక్షాన నిలబడుతుంటే.. అధికారంలో ఉన్న సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నాయకులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. అన్నం పెట్టే రైతుల సమస్యల కంటే, అంత ముఖ్యమైన పనులు ముఖ్యమంత్రికి ఏముంటాయని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

Updated Date - 2023-05-12T15:41:48+05:30 IST