AP Minister: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ-5పై అక్కసు బయటపెట్టిన మంత్రి గుడివాడ

ABN , First Publish Date - 2023-09-04T10:40:39+05:30 IST

ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ సర్కార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. వైసీపీ ప్రజాప్రతినిధుల మీడియా సమావేశాలకు రానీయకుండా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై పలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసింది. తాజాగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్‌లో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. సోమవారం మంత్రి గుడివాడ మీడియా సమావేశం నిర్వహించారు.

AP Minister: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ-5పై అక్కసు బయటపెట్టిన మంత్రి గుడివాడ

విశాఖపట్నం: ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై (ABN- Andhrajyothy) వైసీపీ సర్కార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. వైసీపీ ప్రజాప్రతినిధుల మీడియా సమావేశాలకు రానీయకుండా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై పలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ((Minister Gudivada Amarnath)ప్రెస్‌మీట్‌లో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. సోమవారం మంత్రి గుడివాడ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి, టీవీ 5 (TV-5)మినహా మిగిలిన వారు ప్రశ్నలు వేయాలని మంత్రి చెప్పడం.. ఆ మీడియాలపై ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత బహిర్గతమైంది.


మంత్రి ఇంకా మాట్లాడుతూ.. ఇన్‌కమ్‌టాక్స్ షోకాజ్ నోటీస్‌పై చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఎందుకు స్పందించడం లేదని మంత్రి ప్రశ్నించారు. రూ.118 కోట్లు చాలా చిన్న మొత్తమని... ఇది చిన్నతీగ మాత్రమే అని.. పెద్ద డొంక ఉందని వ్యాఖ్యలు చేవారు. ఇన్‌కమ్‌టాక్స్ నాలుగు నోటీసులు ఇచ్చిందని.. మీరు నోటీసు ఇవ్వడానికి ఎవరని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 118 కోట్లు ఎలా బాబుకు వచ్చాయో.. ఇన్‌కమ్‌టాక్స్ నోటీసులో పేర్కొన్నారన్నారు. చంద్రబాబు పీఏ అన్ని వివరాలు చెప్పారని.. నోటీస్‌లో లోకేశ్‌ పేరు కూడా ఉందన్నారు. నంగనాచి కబుర్లు బాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవి వైసీపీ ఆరోపణలు కాదని.. కేంద్ర ఇన్‌కమ్‌టాక్స్ సంస్ధ ఇచ్చిన నోటీసులు అని చెప్పుకొచ్చారు. సి మాన్స్ కంపెనీలో 3 వేల కోట్లు స్కాంలో బాబు పాత్ర ఉందని.. అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచేచారని ఆరోపించారు. దొంగ దొరికారని, తప్ప కుండా శిక్ష అనుభవించక తప్పదన్నారు. ప్రజాకోర్టులో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఈడీ కలగజేసుకోవాలన్నారు. కోడికత్తి కేసులో సీఎం ఎందుకు కోర్టుకు రావడం లేదన్న ప్రశ్నకు సమాధానాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ దాటవేశారు.

Updated Date - 2023-09-04T10:43:24+05:30 IST