KV SN Raju: వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా పవన్ విశాఖ వస్తారు
ABN , First Publish Date - 2023-11-24T16:25:39+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) ఎన్ని కుట్రలు పన్నినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) విశాఖపట్నానికి వస్తారని చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేవీ ఎస్ఎన్ రాజు ( KV SN Raju ) తెలిపారు.
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) ఎన్ని కుట్రలు పన్నినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) విశాఖపట్నానికి వస్తారని చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేవీ ఎస్ఎన్ రాజు ( KV SN Raju ) తెలిపారు. శుక్రవారం నాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘విశాఖలో పవన్ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లోని బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి పవన్ రావలసిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఉందంటూ ఓ సీఐడీ అధికారి చెప్పడంతో ఏయిర్‌పోర్టు అధికారులు పవన్ విశాఖ పర్యటనను రద్దు చేసినట్లు మాకు సమాచారం వచ్చింది. పవన్‌ను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు పన్నినా.. విశాఖకు రావడం ఖాయం. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ నష్టపరిహారం ఇస్తారు’’ అని కేవీ ఎస్ఎన్ రాజు తెలిపారు.