Minister Botsa: ఈనెల 26 నుంచి బస్సు యాత్ర చేపడతాం
ABN , First Publish Date - 2023-10-13T17:21:38+05:30 IST
విశాఖ పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: విశాఖ పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు విశాఖ వైసీపీ పార్టీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ వివరాలను బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘‘ 26 నుంచి అన్ని ప్రాంతాల్లో మూడు భాగాలుగా చేసి 175 నియోజకవర్గాలల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించాం. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రతిపక్షాలు చేసిన అవినీతిని ఈ బస్సుయాత్రలో ప్రజలకు తెలియజేసేలా కార్యచరణ రూపొందించాం. మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్‌రెడ్డి ఎందుకు కావాలనే అంశంపై ప్రజలకు వివరిస్తాం. 26వ తేదీన ఇచ్ఛాపురం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
గంటా శ్రీనివాసరావుకి ఇక్కడి ప్రజల బాధలు తెలియవు..
‘‘ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు 13రోజులు మొదటి దశలో బస్సుయాత్ర ఉంటుంది. ఈ బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్‌రెడ్డి ఎందుకు అవసరమో తెలియజేస్తాం. విశాఖలో పరిపాలన రాజధాని పెట్టాలని నిర్ణయించాం. రోజు ఇక్కడి నుంచే పరిపాలన చేయాలని సీఎం జగన్‌రెడ్డిని కోరుకుంటున్నాను. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్థానికుడు అయితే ఇక్కడి ప్రజల బాధ ఆయనకు తెలుస్తుంది. ఇక్కడ స్థానికులు ఎవ్వరు రాజధాని వద్దు అని అన్నారు. గంటా ఈ ప్రాంతం వ్యక్తి కాదు.. ఆయనకు మాబాధలు తెలియవు. రేపు వచ్చేది మా ప్రభుత్వమే. నిబంధనలు ప్రకారమే బాబుకు టెస్ట్‌లు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా దూషించడం రాజకీయ సంప్రదాయం కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు. సంప్రదాయాలు గురించి వివరించారు. లోకేష్ అమిత్‌షాను మాకేందుకు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.