Share News

Minister Botsa: ఉపాధ్యాయ సంఘంతో మంత్రి బొత్స చర్చలు విఫలం

ABN , Publish Date - Dec 30 , 2023 | 10:32 PM

విశాఖ సర్క్యూట్ హౌస్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) తో సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయుల సంఘం సమావేశం అయింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు డిమాండ్‌లలో కొన్నింటిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ కీలకమైన డిమాండ్ల స్థానంలో చేతులెత్తేసింది.. దీంతో ఉపాధ్యాయుల సంఘం చర్చలు విఫలం అయినట్లు సమాచారం.. సమ్మె కొనసాగుతుందని ఉపాధ్యాయులు ప్రకటించారు.

Minister Botsa: ఉపాధ్యాయ సంఘంతో మంత్రి బొత్స చర్చలు విఫలం

విశాఖపట్నం: విశాఖ సర్క్యూట్ హౌస్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) తో సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయుల సంఘం సమావేశం అయింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు డిమాండ్‌లలో కొన్నింటిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ కీలకమైన డిమాండ్ల స్థానంలో చేతులెత్తేసింది.. దీంతో ఉపాధ్యాయుల సంఘం చర్చలు విఫలం అయినట్లు సమాచారం.. సమ్మె కొనసాగుతుందని ఉపాధ్యాయులు ప్రకటించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో డిమాండ్లు నెరవేరతాయనే ఆలోచనలతో సమ్మెలు చేయడం సహజమని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలు వంటివి ప్రేరేపితంతో జరుగుతుంటాయని అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ సహా ఉపాధ్యాయ సంఘాలకు తాను ఎప్పుడు అందుబాటులోనే ఉన్నానని తెలిపారు. ఇప్పుడే వాళ్ల సమస్యలను తన దృష్టికి తెచ్చారని పరిశీలించి పరిష్కారం చూపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు.

Updated Date - Dec 30 , 2023 | 10:32 PM