Dharmana Prasada Rao: జగన్మోహనం అభివృద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన
ABN , First Publish Date - 2023-11-17T17:32:23+05:30 IST
"జగన్మోహనం అభివృద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్" పుస్తకాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. సచివాలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Minister Dharmana Prasada Rao ) పుస్తకావిష్కరణ చేశారు.
అమరావతి: "జగన్మోహనం అభివృద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్" పుస్తకాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. సచివాలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Minister Dharmana Prasada Rao ) పుస్తకావిష్కరణ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్‌కు ఉన్న క్లారిటీ ఈ పుస్తకంలో వివరించినట్లు రచయిత వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. "జగన్మోహనం అభివృద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్" అనే పుస్తకంలో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ పుస్తకాన్ని రాశారని తెలిపారు. పరిపాలనలో కొత్త విధానాలు అమలు చేస్తున్నఅంశాలు ఈ పుస్తకంలో రాయడం వల్ల భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు. పుస్తకం రాసిన రచయతకు ప్రభుత్వం, పార్టీ తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.