Amarnath: గంగవరం పోర్టు కార్మికులతో చర్చలు సఫలం
ABN , First Publish Date - 2023-08-31T21:54:02+05:30 IST
గంగవరం పోర్టు(Gangavaram port) కార్మికుల నేతలతో చర్చలు సఫలం అయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్(Amarnath) తెలిపారు.
విశాఖపట్నం: గంగవరం పోర్టు(Gangavaram port) కార్మికుల నేతలతో చర్చలు సఫలం అయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్(Amarnath) తెలిపారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అమర్నాథ్ సమక్షంలో అఖిలపక్షంతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. గంగవరం పోర్టు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరు అవుతారని చెప్పారు.రెండు వేల రూపాయల ఇంక్రిమెంట్...,10 వేల రూపాయలు బోనస్ చెల్లించేందుకు గంగవరం పోర్ట్ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు.25లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపు., నాలుగు కార్పొరేట్ ఆస్పత్రులతో వైద్య సేవలు కల్పిస్తామన్నారు.సమ్మె సమయంలో 22రోజులకు వేతనం చెల్లింపు ఉంటుందన్నారు. కార్మికులకు మేజర్ హాస్పటల్లో మెడికల్ ఫెసిలిటీ కల్పిస్తామన్నారు.ఆందోళన చేసిన 5 గురు కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటామని మంత్రి అమర్పాథ్ తెలిపారు.