Pawan kalyan: విశాఖలో పవన్ బహిరంగ సభ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
ABN , First Publish Date - 2023-08-10T17:27:30+05:30 IST
జనసేనాని ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై, వలంటీర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పొలిటికల్‌గా పెద్ద దుమారమే చెలరేగింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద రచ్చ చేశాయి.
విశాఖ: మరికాసేపట్లో విశాఖ జగదాంబ జంక్షన్ దగ్గర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) బహిరంగ సభ జరగనుంది. వారాహి వాహనం నుంచి ప్రజలనుద్దేశించి పవన్ మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే జగదాంబ పరిసరాల్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సభా ప్రాంగణానికి ప్రజల్ని రానివ్వకుండా అడుగడుగునా బారికేళ్లు ఏర్పాటు చేశారు. అయినా సభా ప్రాంగణానికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చింది. ఇక పోలీసుల అతితో చాలా షాపులు మూసివేశారు. జగదాంబ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో షాపులు మూసి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనసేన జెండాలతో జనసైనికులు, కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని జనసేన కార్యకర్తలు ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే జనసేనాని ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై, వలంటీర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పొలిటికల్‌గా పెద్ద దుమారమే చెలరేగింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద రచ్చ చేశాయి. వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినీ ఇండిస్ట్రీపై పడొద్దని... ప్రత్యేక హోదా, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. చిరుపై కౌంటర్ ఎటాక్ చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్ర చేపడుతున్న నేపథ్యంలో పవన్ ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది.