KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నా ఆస్తులు అమ్మైనా సరే...

ABN , First Publish Date - 2023-04-19T14:23:38+05:30 IST

‘‘నాకున్న ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం పోరాడుతాను’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నా ఆస్తులు అమ్మైనా సరే...

విశాఖపట్నం: ‘‘నాకున్న ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం పోరాడుతాను’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ (Prajashanti Parti Chief KA Paul) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మోదీ (PM Modi), అమిత్ షా (Amith Shah) దేశాన్ని అదాని, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఇస్తామన్న హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు అన్ని పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం ఆపాలని రెండేళ్ల క్రితమే లేఖ రాశానట్లు చెప్పారు. అమెరికన్ ఫండ్‌ను నేరుగా అనుమతిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి తానే ఫండ్ ఇస్తానని... స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రానికి ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేయాలన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) డ్రామాలు ఎవరు నమ్మొద్దని.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని హితవుపలికారు. ‘‘తెలంగాణను కాపాడలేని నువ్వు, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతావా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని యెద్దేవా చేశారు. ‘‘దొంగలు కావాలంటే ఇప్పుడున్న పార్టీల్ని ఎన్నుకోండి.. హక్కులు కావాలంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వండి’’ అంటూ ప్రజలను కోరారు. తనకు ప్రాణహానీ ఉందని.. అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan) బీజేపీ వదిలి బయటకురావాలన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నట్లు కేఏపాల్ పేర్కొన్నారు.

కాగా.. బుధవారం కేఏపాల్‌ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) కలిశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేసేందుకు ఉన్నటువంటి అన్ని ప్రయత్నాలు వాడుకుంటామని అందులో భాగంగానే కేఏపాల్‌ను కలిసినట్లు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-04-19T14:23:38+05:30 IST