botsa: అసెంబ్లీలో టీడీపీ తన వాదన చెప్పుకోలేకపోయింది
ABN , First Publish Date - 2023-09-29T15:47:43+05:30 IST
ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. అన్నీ ఆలోచించిన తర్వాత చేయలేమని చెప్పాం. అందుకే జీపీఎస్ అమలు చేశాం. ఐదు కోట్ల మంది ప్రజల అవసరాలు ముఖ్యం. ఏ ఒక్క వర్గం మేలు కోసం ప్రభుత్వం పనిచేయదు.
విజయనగరం: దోచుకుతిన్న వారు ధర్నాలు చేసినపుడు వదిలిపెడితే అందరూ అదే త్రోవలో వెళ్తారని మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) వ్యాఖ్యానించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘అనేక కేసుల్లో మొన్నటి వరకు స్టేలు తెచ్చుకొని చంద్రబాబు (Chandrababu) బ్రతికారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. అసెంబ్లీలో తమ వాదన టీడీపీ (tdp) చెప్పుకోలేకపోయింది. ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. అన్నీ ఆలోచించిన తర్వాత చేయలేమని చెప్పాం. అందుకే జీపీఎస్ అమలు చేశాం. ఐదు కోట్ల మంది ప్రజల అవసరాలు ముఖ్యం. ఏ ఒక్క వర్గం మేలు కోసం ప్రభుత్వం పనిచేయదు. ఈ మధ్య నాయకుల్లో సమన్వయం కొరవడింది. ఎమ్మెల్యేలు చక్రవర్తులు మాదిరిగా.. ఎంపీపీలు సామంతులు మాదిరిగా చలామణి అవుతున్నారు. ఇది తప్పు అని చెబుతున్నాను.’’ అని బొత్స చెప్పుకొచ్చారు.