Showcause Notices: అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికిన అర్చకులకు షోకాజ్ నోటీసులు

ABN , First Publish Date - 2023-07-15T10:40:35+05:30 IST

రామతీర్ధం అనువంశక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును పూర్ణకళశంతో స్వాగతం పలికిన అర్చకులకు షోకాజ్ నోటీసులు వెళ్లాయి.

Showcause Notices: అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికిన అర్చకులకు షోకాజ్ నోటీసులు

విజయనగరం: రామతీర్ధం అనువంశక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును (Former Union Minister Ashok Gajapathiraju) పూర్ణకళశంతో స్వాగతం పలికిన అర్చకులకు షోకాజ్ నోటీసులు వెళ్లాయి. భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రలో భాగంగా రామతీర్ధం కూడలిలో అశోక్‌ను ఆరుగురు అర్చకులు ఆశీర్వదించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో కిషోర్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. అశోక్‌ గజపతి రాజును ఆశీర్వదించిన ఆరుగురు అర్చకులకు ఈవో షోకాజ్ నోటీసులు పంపారు. తమకు తెలియకుండా టీడీపీ నేతలకు ఎలా స్వాగతం పలుకుతారు అంటూ ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు అందజేశారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే తమతో పోరాడాలని నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ బంగార్రాజు అన్నారు. ‘‘పూజలు చేసే పుజారులు మీదా మీ ప్రతాపం’’ అంటూ టీడీపీ నేత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-15T10:40:35+05:30 IST