Boragam Srinivasulu: ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదంటూ జగన్‌పై బొరగం శ్రీనివాసులు విమర్శలు
ABN , First Publish Date - 2023-04-07T23:18:47+05:30 IST
ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదంటూ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై పోలవరం నియోజకవర్గం టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శలు గుప్పించారు.
ఏలూరు జిల్లా: ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదంటూ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై పోలవరం నియోజకవర్గం టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గంజాయి మయం తప్ప ఉపాధి లేదని, సంక్షేమం పేరుతో అప్పులు చేస్తూ సంక్షోభం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, అభివృద్ధి చెందుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని బొరగం శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ (YCP) ప్రభుత్వ పాలన గురించి బుట్టాయగూడెం గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు, ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంపు, పన్నుల భారం మోపి సామాన్యులను బ్రతకలేని పరిస్థితికి తీసుకువచ్చాడని బొరగం శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెం పంచాయతీలో జరిగిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, పార్లమెంట్ రైతు కార్యదర్శి గద్దె అబ్బులు, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యండ్రపగడ శ్రీనివాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ, ఎస్టీ సెల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందిని, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బ రాంబాబు, రైతు కార్యదర్శి కుందుల శ్రీను, మాజీ సొసైటీ అధ్యక్షులు కరగర రాము, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వరక కృష్ణారాజు, పూసం ముక్కమ్మ, పసుమర్తి భీమేశ్వరరావు, మొడియం సింగరాజు, మొడియం సూర్యచంద్రం, కప్పల నాగేశ్వరరావు, చిలకముడి సుధాకర్, బొబ్బర ఏలీషా, మాటూరు ముసలయ్య, జల్లేపల్లి జితేంద్ర, మండలం ఉపాధ్యక్షుడు కేరం వెంకటేశ్వరరావు, కైగల సూరిబాబు, ఆండ్రుశ్యాం కుమార్, చోడెం అర్జున్, రమణ మండపాటి, మోజేష్ తాతి, దుర్గ పూసం, మంగరాజు, గన్నిన సూర్యనారాయణ, జెడ్ పాపారావు, వెట్టి రాయుడు, జోడే పాపారావు, కంగాల రామామ్మ, చోడెం అక్కమ్మ, కొవ్వసి మహాలక్ష్మి, రాష్ట్ర ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మానెల్లి బాలు, శెట్టి పరమహంసతోపాటు తదితరులు పాల్గొన్నారు.