CPI Ramakrishna: సీబీఐ ఓ చెత్త డిపార్ట్‌మెంట్ :సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2023-05-28T15:50:39+05:30 IST

సీబీఐ చెత్త డిపార్ట్‌మెంట్‌గా తయారైందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు. కర్నూలుకు వెళ్లి గడ్డ పీకారా? అంటూ ఫైర్ అయ్యారు. చేతకానప్పుడు హైదరాబాద్‌లోనే ఉండొచ్చుకదా అని ఘాటుగా విమర్శించారు. ఏపీ పోలీసులు ఏనాడో తమ గౌరవ పోగొట్టుకున్నారని రామకృష్ణ స్పష్టం చేశారు.

CPI Ramakrishna: సీబీఐ ఓ చెత్త డిపార్ట్‌మెంట్ :సీపీఐ రామకృష్ణ

ప.గో.: సీబీఐ(CBI) చెత్త డిపార్ట్‌మెంట్‌(Garbage Dept)గా తయారైందని సీపీఐ రామకృష్ణ(CPI Ramakrishna) ఆరోపించారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు, కర్నూలుకు వెళ్లి గడ్డ పీకారా? అంటూ ఫైర్ అయ్యారు. చేతకానప్పుడు హైదరాబాద్‌లోనే ఉండొచ్చుకదా అని ఘాటుగా విమర్శించారు. ఏపీ పోలీసులు ఏనాడో తమ గౌరవ పోగొట్టుకున్నారని రామకృష్ణ స్పష్టం చేశారు.

సీబీఐ విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన.. బాధితురాలు (వివేకా కుమార్తె సునీత)పై, సీబీఐపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. “ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విషయంలో చేసినట్లుగా కడప ఎంపీని అరెస్టు చేయడం సీబీఐకి సాధారణ విషయమే అయినా కడప వెళ్లి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాల చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిందని ఏపీలో అదే పని చేయడం లేదని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రమంత్రి అమిత్‌షాతో కుమ్మక్కయ్యారని, దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు.

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భారతదేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి పదవి ప్రతిష్టను తగ్గించడం తప్ప మరొకటి కాదని రామకృష్ణ అన్నారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి 21 ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉండడాన్ని ఆయన స్వాగతించారు.

Updated Date - 2023-05-28T15:53:27+05:30 IST