AP News: టీడీపీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం
ABN , First Publish Date - 2023-04-28T15:44:14+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలవరం నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం జరిగింది.
పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు పోలవరం నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం జరిగింది. పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Polavaram Constituency Convenor Boragam Srinivasulu) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పరిశీలకులు కోళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేత శావిలి సుభాష్ చంద్రబోస్ టీడీపీ యాప్‌లోని ఫ్యూచర్స్‌పై వివరించారు. అలాగే ఆర్టీఎస్ గురించి కొండపల్లి రవి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఓటర్ హౌస్ మ్యాపింగ్‌పై వాకా కళ్యాణ్ ట్రైనింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కోళ్ళ నాగేశ్వరరావు, బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ... ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించే ప్రతి అంశాన్ని క్యాడర్ అందిపుచ్చుకోవాలి అని తెలిపారు. అరాచకవాది జగన్ రెడ్డి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడం కోసం అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శీలం వేంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, నాయుడు రామకృష్ణారావు గౌడ్, బొడ్డు కృష్ణ, పారేపల్లి నరేష్, అమరవరపు అశోక్, సుంకవల్లి సాయికృష్ణ, ఏలూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రప్రగడ శ్రీనివాస్, తెలుగురైతు పార్లమెంటు కార్యదర్శి గద్దె అబ్బులు, ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగరిక, మడకం రామకృష్ణ, తెల్లం వెంకటేశ్వరరావు, జ్యేష్ఠ రామకృష్ణ, నాయుడు లిలాకాంత్, తెలుగుయువత నియోజకవర్గం అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, మానెల్లి బాలు, గార్లు తదితరులు పాల్గొన్నారు.