Raghurama: ఆ ఎంపీ చెప్పుకోలేని విధంగా దూషించారు..

ABN , First Publish Date - 2023-07-20T17:05:15+05:30 IST

న్యూఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనను చెప్పుకోలేని విధంగా దూషించారని, ఎంపీ వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

Raghurama: ఆ ఎంపీ చెప్పుకోలేని విధంగా దూషించారు..

న్యూఢిల్లీ: పార్లమెంట్ (Parliament) సెంట్రల్ హాల్లో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana) తనను చెప్పుకోలేని విధంగా దూషించారని, ఎంపీ వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్‌ (Lok Sabha Speaker)కు లేఖ (Letter) రాశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆ ఎంపీ తనపై చాలా అసభ్య పదజాలం వాడారన్నారు. తనను చంపేస్తానని కడప భాషలో మాట్లాడారన్నారు. గతంలో కూడా ఒక ఎంపీ తనను లేపేస్తానని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే ప్రధాన మంత్రికి లేఖ రాశానని, ఎంపీ కుటుంబాన్ని కాపాడడానికి గతంలో కూడా తాను లేఖ రాశానని, దానిలో తప్పు ఏముంది.. లేఖ రాయడమే పాపంగా మారిందన్నారు.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా విశాఖలో వ్యాపారం చేయను అని అన్నారని, కేంద్ర హోంశాఖ నుంచి కూడా లేఖ వచ్చిందని రఘురామ పేర్కొన్నారు. లేఖ వచ్చిన తర్వాత కిడ్నాప్ అంశం తెరపైకి వస్తుందనే భయంతో ఇలా మాట్లాడి ఉంటారన్నారు. ఎంపీ ఎంవీవీకి చెప్పుకోలేని బాధ ఏదో ఉండి ఉంటుందని, ఈ మాటల వెనుక జగన్ కుట్ర ఉండి ఉంటుందని ఆయన అన్నారు. ఎంపీ సత్యనారాయణ అన్ని తిట్లు తిట్టిన తర్వాత మిథున్ రెడ్డి వచ్చి ఎంవీవీ పక్కకు తీసుకెళ్ళారని అన్నారు. తన పక్కన ఉన్న ఇతర రాష్ట్రాల ఎంపీలు సహితం ఆయన వ్యాఖ్యాలను ఖండించారన్నారు. ఎంవీవీ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ ఆయనకు ఏమైనా అయితే తన అకౌంట్‌లో ఖర్చు రాస్తారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-07-20T17:05:15+05:30 IST