MP Raghurama: అందుకే ఒకే డోర్ నెం.పై అనేక దొంగ ఓట్లు..

ABN , First Publish Date - 2023-08-04T15:38:13+05:30 IST

న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకే ఒకే డోర్ నెంబర్‌పై అనేక దొంగ ఓట్లు నమోదు చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఇంటింటికి తిరిగి దొంగ ఓట్లను తీసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

MP Raghurama: అందుకే ఒకే డోర్ నెం.పై అనేక దొంగ ఓట్లు..

న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Govt.) నిర్ణయించిందని.. అందుకే ఒకే డోర్ నెంబర్‌ (Door No.)పై అనేక దొంగ ఓట్లు (Fake Votes) నమోదు చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికి తిరిగి దొంగ ఓట్లను తీసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాలంటీర్లను తీసుకుని ఓట్ల నమోదుకు వెళ్తున్నారని, ఎన్నికల కమిషన్ (Election Commission) చెప్పినా వినడం లేదని, ఈ అంశాన్ని ఈసీ (EC) చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. వాలంటీర్ ఇంటికి వస్తే పసుపు నీళ్లతో శుద్ధి చేద్దామన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దంగా ఉందన్నారు.

ఆర్-5 జోన్‌పై నిన్న (గురువారం) హై కోర్టు (HIgh Court) వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Govt) చాచి పెట్టీ కొట్టిందని రఘురామ అన్నారు. ఈ అంశంలో చంద్రబాబు (Chandrababu) మోకాలు అడ్డు పెట్టారని సజ్జల (Sajjala) అంటున్నారని, అలా అనడానికి సిగ్గుండాలన్నారు. సెంట్ భూమిలో ఎలా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని ప్రశ్నించారు. అందరూ ఏ1, ఏ2 (A1, A 2) లాగా కురసగ (పొట్టిగా) ఉండరని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిందన్నారు.

నాలుగేళ్లుగా రాష్ట్రానికి శని పట్టిందని, నారా లోకేష్ యువగళం యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రఘురామ అన్నారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపడుతున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్ యాత్రలు చేస్తున్నారన్నారు. దీంతో వైసీపీ పార్టీకి కష్టకాలం ప్రారంభమైందన్నారు. ఏపీ ప్రజలకు శుక్రదశ పట్టింది... ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని రఘురా కృష్ణంరాజు సూచించారు.

Updated Date - 2023-08-04T15:38:13+05:30 IST