Lokesh: గజదొంగ పాలనలో ఇసుక మాఫియాకు రెడ్ కార్పెట్
ABN , First Publish Date - 2023-08-31T11:50:21+05:30 IST
గజదొంగ పాలనలో ఇసుక మాఫియాకు రెడ్ కార్పెట్ పరుస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు: గజదొంగ పాలనలో ఇసుక మాఫియాకు రెడ్ కార్పెట్ పరుస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో మాట్లాడుతూ.. జగనాసురుడి ఇసుక దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రజలు సొమ్ము అడ్డంగా మేసేసి 16నెలలు చిప్పకూడు తిన్న గజదొంగకు ప్రజలు తాళాలు ఇచ్చారన్నారు. జంగారెడ్డిగూడెం శివార్లలో తరలివెళ్తున్న ఇసుక టిప్పర్ను చూసి లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అడ్డగోలు ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసిందని.. వాటిని రాజారెడ్డి రాజ్యాంగంలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన పోలీసులు ఇసుక దొంగలకు రక్షణగా నిలుస్తూ ప్రశ్నించే గళాలపై ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. దుర్మార్గులు, దొంగలు రాజ్యమేలతారని కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతోందని లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.