Raghu Rama Krishna Raju: 5 శాతం వారికి టీటీడీలో 9 పదవులా?
ABN , First Publish Date - 2023-08-26T15:35:20+05:30 IST
టీటీడీ పాలకమండలిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘24 మందితో టీటీడీ పాలకమండలి నియమించారు. ఆరు నెలలు జైల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డి టీటీడీ మెంబర్ ఇచ్చారు.. దీంట్లో తప్పేమీ లేదనుకుంటా?, మరి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మనలను రూల్ చేస్తున్నారు.
ఢిల్లీ: టీటీడీ పాలకమండలిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘24 మందితో టీటీడీ పాలకమండలి నియమించారు. ఆరు నెలలు జైల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డి టీటీడీ మెంబర్ ఇచ్చారు.. దీంట్లో తప్పేమీ లేదనుకుంటా?, మరి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మనలను రూల్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎవరు రూల్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అంటారు. టీటీడీ పాలకమండలిలో ఏడుగురు రెడ్లు ఉన్నారు. 5 శాతం ఉన్న వారికి 9 పదవులా?, జనాభాలో 76 శాతం ఉన్న సామాజిక వర్గానికి మాత్రం 6 శాతం పదవులు ఇచ్చారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా దైవ భక్తి ఉన్నవారికి ఇస్తారు.. పైరవీ కారులకు కాదు. వైసీపీ జాతీయ పార్టీ కాబట్టి ముంబై.. ఇతర రాష్ట్రాల వారికి టీటీడీ మెంబర్ ఇచ్చారు. తిరుమలలో చిరుతలను నిషేధించలేక చిన్న పిల్లలను నిషేధించారు.’’ అని విమర్శించారు.