Raghu rama krishna raju: భోళా శంకర్ సినిమాకు వైసీపీ లీడర్లు ఇబ్బందులు పెడతారు
ABN , First Publish Date - 2023-08-09T14:45:55+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి మాట చెప్పారు. సినిమా ఇండస్ట్రీ చిన్నది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నారు. రోడ్లు, రాష్ట్ర అభివృద్ధి చేసుకోమని మెగాస్టార్ హైదరాబాద్లో చెప్పారు. దానికి భుజాలు తడుముకుని మాట్లాడుతున్నారు మా పార్టీ నేతలు. ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల మందికి ఉపాధి లభిస్తుంది. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో
ఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పుపట్టడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి మాట చెప్పారు. సినిమా ఇండస్ట్రీ చిన్నది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నారు. రోడ్లు, రాష్ట్ర అభివృద్ధి చేసుకోమని మెగాస్టార్ హైదరాబాద్లో చెప్పారు. దానికి భుజాలు తడుముకుని మాట్లాడుతున్నారు మా పార్టీ నేతలు. ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల మందికి ఉపాధి లభిస్తుంది. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలు మాట్లాడకుండా హీరోల పారితోషికానికి ఒక రేటు నిర్ణయించాలని అంటున్నారు. సాయిరెడ్డికి బుద్ధి ఉందా అసలు. హీరోల స్థాయిని బట్టి వారికి పారితోషికం ఉంటుంది.’’ అని తెలిపారు
‘‘జగన్ రూ. 40 వేల కోట్లు సంపాదించారు అని అంటారు. 151 మంది ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాలంటే ఎలా ఉంటుంది. రాష్ట్రంలో వరదలు వస్తే మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ వచ్చి బ్రో సినిమాపై పిర్యాదు ఏంటి? శ్యామ్ బాబు పాత్ర చూసి అంబటి రాంబాబు ఎందుకు ఫీల్ అవుతున్నారో అసలు అర్థం కావడం లేదు. భోళా శంకర్ సినిమాకు మా పార్టీ నేతలు ఎలాగూ ఇబ్బందులకు గురి చేస్తారు. ఒక మంచి మాట చిరంజీవి చెప్పారు.. దానిపై కుటిల రాజకీయం సరికాదు. చిరంజీవిని కామెంట్ చేస్తున్న మంత్రులు ఎవరికీ అంత స్థాయి లేదు. అన్ని సామాజిక వర్గాల్లో చిరంజీవికి ఫ్యాన్స్ ఉన్నారు. రెడ్డి అనేది సామాజికవర్గం కాదు.. కేవలం టైటిల్ మాత్రమే. చిరంజీవిని కాపులతో తిట్టిస్తారా?.’’ అంటూ రఘురామ మండిపడ్డారు