Lokesh YuvaGalam: 2700కి.మీ.లకు యువగళం.. తప్పుడు కేసులు ఎత్తేస్తానని హామీ... పైలాన్ ఆవిష్కరణ!

ABN , First Publish Date - 2023-08-31T12:42:57+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మరో మైలురాయిని చేరింది.

Lokesh YuvaGalam: 2700కి.మీ.లకు యువగళం.. తప్పుడు కేసులు ఎత్తేస్తానని హామీ... పైలాన్ ఆవిష్కరణ!

పశ్చిమగోదావరి: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam Padayatra) మరో మైలురాయిని చేరింది. 200వ రోజు 2700 కిలోమీటర్ల మైలురాయికి యువగళం చేరుకుంది. ఈ సందర్బంగా తప్పుడు కేసులు ఎత్తేస్తానని హామీ ఇస్తూ యువనేత పలాన్‌ను ఆశిష్కరించారు. రాష్ట్రంలో సైకోపాలనపై సమరభేరి మోగిస్తూ ప్ర‌జాచైత‌న్య‌మే ల‌క్ష్యంగా తాను ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద 200వ రోజున 2700 కి.మీ.ల మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని లోకేశ్ అన్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ స‌ర్కారు వివిధ వర్గాల ప్రజలపై బనాయించిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తానని హామీ ఇస్తూ పైలాన్‌ను ఆశిష్కరించినట్లు తెలిపారు. దీనివల్ల జగనాసురుడి పాలనలో బాధితులైన ప్రజలకు విముక్తి లభిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.


కాగా.. లోకేశ్ యువగళం పాదయాత్రం 200 రోజులకు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుంచి 200వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా పాదయాత్రలో నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెంలో గిరిజనులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొననున్నారు. గిరిజనుల సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వనున్నారు. 200 రోజుల పాదయాత్ర సందర్భంగా లోకే‌శ్‌కు శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున నాయకులు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ప్రజలు పాదయాత్ర జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.

Updated Date - 2023-08-31T12:42:57+05:30 IST