Ycp Minister: దుర్గగుడి అభివృద్ధికి రూ.125 కోట్లు ఇస్తాం.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని అమ్మవారిని సీఎం జగన్ కోరుకున్నారు
ABN , First Publish Date - 2023-10-20T19:14:18+05:30 IST
దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పంచాంగంను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు.
విజయవాడ: దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పంచాంగంను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు.
"నవరాత్రుల్లో ఇప్పటి వరకు 5 లక్షల 75 వేల మంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. నవరాత్రుల్లో గడచిన 5 రోజుల్లో 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మూలా నక్షత్రంలో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1 లక్షా 03 వేల 743 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాల్టి దర్శనానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్షాదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలని అమ్మవారిని సీఎం జగన్ కోరుకున్నారు. దుర్గగుడి అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులను సీఎం గతంలో మంజూరు చేశారు. కేటాయించిన రూ. 70 కోట్లలో ఇప్పటి వరకు రూ. 15 కోట్లు ఖర్చయ్యాయి. దేవస్థానం అభివృద్ధి కోసం రూ. 125 కోట్లు దేవాదాయశాఖ ద్వారా నిధులు ఇస్తాం. రూ. 45 కోట్ల వ్యయంతో బీవోటీలో షేరింగ్ మోడ్ లో వాహనాల పార్కింగ్ ప్రాంతం నిర్మిస్తాం. ఏడాదిన్నరలో అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తాం." అని మంత్రి కొట్టు అన్నారు.