Avinash CBI Enquiry: మూడు గంటలుగా కొనసాగుతున్న అవినాశ్ విచారణ.. సీబీఐ ప్రశ్నలు ఇవే..
ABN , First Publish Date - 2023-06-03T13:31:31+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మూడు గంటలుగా ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ కొనసాగుతోంది. మూడు గంటలుగా ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు విచారణ సాగనుంది. వాట్సప్ కాల్స్, నిందితులతో పరిచయాలపై సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియోలు సీబీఐ అధికారులు చిత్రీకరిస్తున్నారు. వివేకా హత్యకు వాడిని గొడ్డలిపై కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయంపై ఆరా తీస్తోంది. వివేకా మరణంపై జగన్ మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) ముందుగా ఎవరు చెప్పారన్న విషయాన్ని సీబీఐ లేవనెత్తింది. అయితే తనకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని అవినాశ్ సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అవినాష్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
కాగా.. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు మే 31 వరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ముందస్తు బెయిల్ రూపంలో అవినాశ్‌కు భారీ ఊరట లభించింది.