Husband Forced Wife: ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?
ABN , First Publish Date - 2023-07-28T20:49:28+05:30 IST
తమ భార్యల విషయంలో భర్తలు ఎంత పొసెసివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పరాయి మగాడు కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది..
తమ భార్యల విషయంలో భర్తలు ఎంత పొసెసివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పరాయి మగాడు కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది.. టచ్ చేసేదాకా వస్తే ఊరికే ఉంటారా? లోపలి నుంచి సిసలైన హీరో తన్నుకువచ్చి, వారికి బుద్ధొచ్చేలా నాలుగు తగిలిస్తారు. కానీ.. అందరు భర్తలు ఇలా ఉండరని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. కేవలం రూ.1500 మద్యం కోసం.. ఓ నీచుడు తన భార్యని తన స్నేహితులతో పడుకోమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించినందుకు.. బలవంతంగా స్నేహితులతో అత్యాచారం చేయించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో తేజ్‌పాల్, నఖాసా అనే దంపతులు నివసిస్తున్నారు. తేజ్‌పాల్ మద్యానికి బానిస కావడంతో.. డబ్బులన్నీ దానికే ఖర్చు పెట్టేవాడు. పైగా.. ఇంట్లో ఉన్న భార్యను నిత్యం వేధించేవాడు. ఒకరోజు మద్యం కోసం డబ్బులు లేక.. స్నేహితుల్ని అడిగాడు. అయితే.. తేజ్‌పాల్ భార్యపై కన్నేసిన అతని స్నేహితులు, ఆమెతో పడకసుఖానికి ఒప్పుకుంటేనే డబ్బులు ఇస్తామని చెప్పారు. అందుకు ఏమాత్రం సంకోచించకుండా తేజ్‌పాల్ సరేనని చెప్పాడు. స్నేహితుల్ని ఇంటికి తీసుకెళ్లి, వారితో పడుకోవాలని భార్యపై ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోగా.. ‘నువ్వు మరీ ఇంత నీచుడివా’ అంటూ భర్తకు నాలుగు తగిలించింది. దీంతో కోపాద్రిక్తుడైన తేజ్‌పాల్.. ఆమెని కొట్టాడు. అంతేకాదు.. ఆమెపై అత్యాచారం చేయాల్సిందిగా స్నేహితుల్ని ఉసిగొల్పాడు. అలా అందరూ రాబందుల్లా ఆమెని రేప్ చేశారు.
ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని, నఖాసా లోలోపలే కుమిలిపోయింది. ఆ మౌనమే ఆమె పాలిట శాపమైంది. ఎందుకంటే.. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆ నీచులు మళ్లీ మళ్లీ ఇంటికొచ్చి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవారు. ఇక సహించలేక.. నఖాసా పోలీసుల్ని ఆశ్రయించింది. మద్యం కోసం భర్త తనను స్నేహితులకు తాకట్టు పెట్టాడని.. వాళ్లు తనపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 452, 504, 376డీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నఖాసా పోలీసుల్ని ఆశ్రయించిన విషయం తెలిసి.. భర్త తేజ్‌పాల్‌తో పాటు అతని స్నేహితులు కుల్దీప్, అరుణ్, యోగేష్‌లు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.