Viral: పాపం.. ఈ భర్తకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదు.. భార్య ఎంత పని చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2023-08-19T15:15:31+05:30 IST
ఇప్పటివరకు మనం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తల అడుగు జాడల్లో నడిచే భార్యలను చూశాం. కష్టమైన, సుఖమైన భర్త అనుభవించే వాటి అన్నింటిలో భార్య కూడా పాలుపంచుకుంటుంది.
ఇప్పటివరకు మనం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తల అడుగు జాడల్లో నడిచే భార్యలను చూశాం. కష్టమైన, సుఖమైన భర్త అనుభవించే వాటి అన్నింటిలో భార్య కూడా పాలుపంచుకుంటుంది. ముఖ్యంగా భర్త కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. భర్తలకు భార్యలు చేసే సేవల గురించి మంచి మంచి సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం పలువురు భార్యలు అలా ఉండడం లేదు. భర్త ఆనందంలో పాలుపంచుకుంటున్న భార్యలు.. అతనికి కష్టం రాగానే దూరంగా వెళ్లిపోతున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ నగరంలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. భార్య, కుటుంబం కోసం 25 ఏళ్లుగా కష్టపడిన ఓ భర్త ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని రెండు కాళ్లను పొగొట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో అతనికి సేవ చేయడం ఇష్టం లేని భార్య.. ఆస్తులు, డబ్బులన్నింటిని లాక్కొని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్(Rajasthan’s Bharatpur) జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పడ్లా గ్రామానికి చెందిన ట్రక్ డ్రైవర్ అయినా ఉన్నస్‌కు(truck driver’s Unnus) 25 ఏళ్ల క్రితం కోటకల గ్రామానికి చెందిన జాహిదాతో( Zahida) వివాహం జరిగింది. ప్రస్తుతం ఉన్నస్ వయసు 48 సంవత్సరాలు. ఆమెకు అప్పటికే ఒక కూతురు కూడా ఉంది. జాహిదా, ఉన్నస్‌కు పెళ్లయ్యాక ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. ఈ 25 ఏళ్లలో కుటుంబం కోసం ఉన్నస్ ఎంతో కష్టపడ్డాడు. ఆస్తులు కూడా పోగేశాడు. భార్య పేరు మీద భూమి, ఇల్లు కొన్నాడు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ప్రమాదం రూపంలో ఉన్నస్ జీవితంలో కలకలం మొదలైంది. 2017లో జరిగిన ఓ ప్రమాదంలో ఉన్నస్ తన రెండు కాళ్లు కోల్పోయాడు. దీంతో వికలాంగుడిగా మారిన ఉన్నస్ మంచానికే పరిమితమయ్యాడు. కొంత కాలం భార్య జావేదా అతనికి బాగానే సేవలు చేసింది. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ భర్తకు సేవలు చేయడం ఆమెకు భారంగా అనిపించింది. దీంతో భర్తను ఇంటి నుంచి గెంటేసింది. తాళి కట్టిన భర్త అనే సంగతిని కూడా పక్కనపెట్టి నీకు సేవలు చేయడం తన వల్ల కాదని తెగేసి చెప్పేసింది. దీనికి పిల్లలు కూడా అడ్డుచెప్పలేదు. తన పేరు మీద ఆస్తులు పొగేసిన భర్త మంచి మనసు గురించి కూడా ఆలోచించలేదు.
కాగా ప్రమాదం జరిగినప్పుడు వచ్చిన రూ.14 లక్షల క్లెయిమ్ సొమ్మును జాహిదానే తీసుకుంది. అంతకుముందు భర్త ఆమె పేరు మీద కొన్న భూమిని అమ్మేసి వచ్చిన డబ్బులను సోదరులతో కలిసి పంచుకుంది. ఉన్న ఇంటిని కూడా తన సొంతం చేసుకుంది. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నస్ 10 రోజుల క్రితం నౌగావాన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులతో తన గోడు వెల్లబోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. తన ఆస్తి అంతటిని కాజేసి తనను ఇంట్లో నుంచి గెట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించాలని కోరుతున్నాడు.