ఇంట్లో శవాలుగా మారిన భార్య, మూడేళ్ల కూతురు.. 15km దూరంలో చెట్టుకు వేలాడుతున్న భర్త శవం.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-22T18:32:12+05:30 IST

ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒకేసారి ప్రాణాలు విడిచారు. అది కూడా ఓ పోలీస్ అధికారిణి ఇంట్లో కావడం గమనార్హం. ఇంట్లో మహిళ పోలీస్, ఆమె మూడేళ్ల కూతురు శవమై కనిపించారు. ఆమె భర్త ఇంటికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు శవమై వేలాడాడు.

ఇంట్లో శవాలుగా మారిన భార్య, మూడేళ్ల కూతురు.. 15km దూరంలో చెట్టుకు వేలాడుతున్న భర్త శవం.. అసలు ఏం జరిగిందంటే..?

ముంబై: ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒకేసారి ప్రాణాలు విడిచారు. అది కూడా ఓ పోలీస్ అధికారిణి ఇంట్లో కావడం గమనార్హం. ఇంట్లో మహిళ పోలీస్, ఆమె మూడేళ్ల కూతురు శవమై కనిపించారు. ఆమె భర్త ఇంటికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు శవమై వేలాడాడు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపుతోంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో(Maharashtra's Buldhana district) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిఖ్లీ నగరంలోని పంచముఖి మహాదేవ్ ఆలయం సమీపంలో(Panchamukhi Mahadev temple in Chikhli city) వర్ష కుటే, కిశోర్ కుటే అనే దంపతులున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు. ఓ కూతురి వయసు 8 ఏళ్లు కాగా.. మరో కూతురి వయసు 3 ఏళ్లుగా ఉంది. వర్ష కుటే పోలీస్‌గా ఉద్యోగం చేస్తుంది.


అయితే సోమవారం నాడు వర్ష కుటే(Varsha Kute), ఆమె మూడేళ్ల కూతురు ఇంట్లో శవమై కనిపించారు. ఆమె భర్త కిషోర్ కుటే(Kishor Kute) ఇంటి నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. కేసు నమెదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భార్య, కుమార్తెను కిషోరే హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత చిఖ్లీ నగరం నుంచి దాదాపు 15 కిలో మీటర్లు ప్రయాణించి ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన జరిగినప్పుడు వారి 8 ఏళ్ల కూతురు పాఠశాలలో ఉంది. దీంతో ఆ బాలికకు ప్రాణపాయం తప్పింది. అయితే భార్య, కూతురిని హత్య చేసిన తర్వాత కిశోర్ తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా కిషోర్, వర్ష దంపతులు చాలా అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. వారి మధ్య గొడవలు జరగడం ఎప్పుడూ చూడలేదంటున్నారు. అలాంటిది ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చావులకు కారణమెంటో తెలియదని చెబుతున్నారు.

Updated Date - 2023-08-22T18:32:12+05:30 IST