ఆ పిల్లలిద్దరూ నా సంతానం కాదంటూ ప్రతీ రోజూ భార్యతో గొడవ.. చివరకు ఆమెకు తెలియకుండానే..
ABN , First Publish Date - 2023-02-13T18:29:59+05:30 IST
చుట్టా, బీడీ, సిగరెట్ ప్రాణానికి ఎంత హానికరమో... అలాగే అనుమానం కూడా అంతే హానికరం. అలాగే క్షణికావేశం కూడా అనేక అనార్థాలకు దారి తీసుంటుంది. కొంత మంది
చుట్టా, బీడీ, సిగరెట్ ప్రాణానికి ఎంత హానికరమో... అలాగే అనుమానం కూడా అంతే హానికరం. అలాగే క్షణికావేశం కూడా అనేక అనార్థాలకు దారి తీసుంటుంది. కొంత మంది ఒకరి మీద కోపం మరొకరి మీద చూపిస్తుంటారు. ఇంకొందరు వస్తువులు మీద చూపిస్తుంటారు. అలా చేయకపోతే వారికి మనశ్శాంతి ఉండదు. మాట జారిన తీసుకోగలం. కాలు జారినా కాపాడుకోగలం. కానీ ప్రాణమే పోతే.. తిరిగొస్తుందా? అందుకే ఆవేశం మంచిది కాదంటారు పెద్దలు. చేతులు కాలాకా.. కాళ్లు పట్టుకున్న ప్రయోజనం ఉండదు.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ కొంత మంది జీవితాల్లో మాత్రం అది మంటగా మారిపోతుంది. ఆ తర్వాత పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో నిత్యం చూస్తూనే ఉంటాం. వింటుంటూనే ఉంటాం.
ఇది కూడా చదవండి: ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. 2 నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?
భార్య శీలాన్ని శంకించిన ఓ అనుమానపు భర్త.. ఇద్దరు కొడుకలను అతి కిరాతంగా హత్య చేసి దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘోరం కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. దేవదుర్గ తాలూకా జక్లేర్దొడ్డిలో నింగప్ప(35), ప్రభావతి (30) దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే భార్యకు అక్రమ సంబంధం ఉందంటూ నిత్యం గొడవ పడుతుండేవాడు. పిల్లలిద్దరూ వివాహేతర సంబంధంతోనే పుట్టారంటూ ఆదివారం కూడా మరోసారి ఘర్షణకు దిగాడు. అనంతరం పిల్లల్ని బయటకు తీసుకెళ్లి గొంతుకోసి హత మార్చాడు. ఈ సంఘటనతో భార్య, బంధువులు హతాశులయ్యారు. గుండెలవిసేలా విలపించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు నింగప్పను పోలీసులు అరెస్ట్ చేశారు.