Viral Video: ఇదేక్కడి మాస్ దొంగతనంరా మావ! పట్టపగలు 5 నిమిషాల్లోనే రూ.14 లక్షలు కొట్టేసిన దొంగలు.. ఎలానో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-13T17:44:16+05:30 IST

మోహాలకు హెల్మెట్లు, మాస్కులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించారు. తుపాకీలతో ఉద్యోగులతోపాటు కస్టమర్లను బెదిరించారు. అక్కడున్న వారందరిని గదిలో పెట్టి బయట తాళం వేశారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బు అంతటిని బ్యాగులో నింపుకుని అక్కడి నుంచి పారిపోయారు.

Viral Video: ఇదేక్కడి మాస్ దొంగతనంరా మావ! పట్టపగలు 5 నిమిషాల్లోనే రూ.14 లక్షలు కొట్టేసిన దొంగలు.. ఎలానో తెలుసా?

గుజరాత్: మోహాలకు హెల్మెట్లు, మాస్కులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించారు. తుపాకీలతో ఉద్యోగులతోపాటు కస్టమర్లను బెదిరించారు. అక్కడున్న వారందరిని గదిలో పెట్టి బయట తాళం వేశారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బు అంతటిని బ్యాగులో నింపుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ సినిమా పేరు ఏదో ఉండే అని ఆలోచిస్తున్నారా!.. కాస్త ఆగండి.. ఇది సినిమా కథ కాదు. నిజ జీవితంలో జరిగిన కథ. అవును మీరు వింటున్నది నిజమే. అచ్చం ఇదే విధంగా బెదిరించిన దొంగలు 5 నిమిషాల్లోనే రూ.14 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ రాజధాని సూరత్‌లో జరిగింది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్(Gujarat) రాష్ట్ర రాజధాని సూరత్‌లో(Surat) గల సచిన్ ప్రాంతంలోని వంజ్ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra) అనే బ్యాంకు ఉంది. అయితే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఐదుగురు వ్యక్తులు, రెండు ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. మోహాలకు హెల్మెట్‌లు, మాస్కులతో నేరుగా ప్రధాన ద్వారం గుండా బ్యాంకులోకి ప్రేవేశించారు. తమ వద్ద తెచ్చుకున్న తుపాకీలతో బ్యాంకు ఉద్యోగులను కస్టమర్లను బెదిరించారు. క్యాష్ కౌంటర్‌లోని డబ్బు అంతటిని తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపమని హెచ్చరించారు. బ్యాగులు నిండాక బ్యాంకు సిబ్బంది, కస్టమర్లను ఓ గదిలో ఉంచి బయట తాళం వేశారు. ఆ తర్వాత అక్కడున్న వారందరి సెల్‌ఫోన్‌లను కూడా తీసుకుని డబ్బు సంచులతోపాటు దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఆ దొంగలు తమ ద్విచక్రవాహనాలను అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటన అంతా 5 నిమిషాల సమయంలోనే పూర్తవడం గమనార్హం. దీంతో బ్యాంకు ఉద్యోగులతోపాటు అక్కడున్న కస్టమర్లు షాక్‌లో ఉండిపోయారు. ఈ ఘటన అంతా బ్యాంకులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. దొంగలు ఎత్తుకెళ్లినా డబ్బులు రూ.14 లక్షలు అని బ్యాంకు సిబ్బంది వెల్లడించారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు లేడని సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్న పోలీసులు దొంగలను పట్టుకోవడానికి సూరత్ వ్యాప్తంగా చెక్ పోస్టులు పెట్టారు. అలాగే దొంగలు వదిలి వెళ్లినా ద్విచక్రవాహనాల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ దొంగతనంరా మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-08-13T18:42:36+05:30 IST