Ambedkar Open Universityలో పీజీ డిప్లొమాలో ప్రవేశాలు
ABN , First Publish Date - 2023-02-18T15:00:46+05:30 IST
హైదరాబాద్ (Hyderabad) లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) (బీఆర్‌ఏఓయూ)- నూతనంగా ఆరంభించిన
హైదరాబాద్ (Hyderabad) లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) (బీఆర్‌ఏఓయూ)- నూతనంగా ఆరంభించిన పీజీ డిప్లొమా (PG Diploma) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు.
ప్రోగ్రామ్‌లు
పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్
పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
పీజీ డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
స్టడీ సెంటర్లు
ఎస్‌ఆర్‌ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్-కరీంనగర్
ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్-ఖమ్మం
ఎంవీఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్- మహబూబ్‌నగర్
నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్-నల్లగొండ
గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్-నిజామాబాద్
ఎస్‌వీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్-తిరుపతి
డా.వీఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్-విశాఖపట్నం
కేయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్-వరంగల్
పీజీ కాలేజ్(ఉస్మానియా యూనివర్సిటీ)- సికింద్రాబాద్
ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్-విజయవాడ
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీ/ కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తిచేసినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
ప్రోగ్రామ్ ఫీజు: రూ.8,000
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10
వెబ్‌సైట్: www.braouonline.in