Gurukula post: దీని మీద దృష్టి పెడితే టీచర్ పోస్టు ఖాయం!

ABN , First Publish Date - 2023-05-22T13:49:32+05:30 IST

తెలంగాణ గురుకుల్‌ బోర్డు దాదాపు 12 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిలో ప్రధానమైనవి టీజీటీ, పీజీటీ, జేఎల్‌, డీఎల్‌ పోస్టులు. వీటిలో సింహభాగం

Gurukula post: దీని మీద దృష్టి పెడితే టీచర్ పోస్టు ఖాయం!
Gurukula post

తెలంగాణ గురుకుల్‌ బోర్డు దాదాపు 12 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిలో ప్రధానమైనవి టీజీటీ, పీజీటీ, జేఎల్‌, డీఎల్‌ పోస్టులు. వీటిలో సింహభాగం టీచింగ్‌ జాబ్స్‌. అందుకే సిలబస్‌లో పెడగాగిని చేర్చారు. వివరంగా చెప్పాలంటే జనరల్‌ స్టడీస్‌, కంటెంట్‌తో సమానంగా మార్కులు కేటాయించారు. పెడగాగి ప్రిపరేషన్‌లో పాటించాల్సిన మెలకువలు, కంటెంట్‌ అంశాలు, ప్రశ్నల తీరు, ప్రిపరేషన్‌ విధానాన్ని పరిచయం చేయడమే ఈ ఆర్టికల్‌ లక్ష్యం.

పెడోస్‌, అగగోస్‌ అనే ప్రాచీన గ్రీకు పదాల నుంచి పెడగాగి ఆవిర్భవించింది. విస్తృత అర్థంలో పిల్లలు అంటే పాఠశాల స్థాయి విద్యార్థులకు బోధించే విధానం ‘పెడగాగి’.

నాగరికత గమనంలో జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించే ప్రసార మార్గాలు పాఠశాలలు. పాఠశాల విద్య ద్వారా, ప్రధానంగా తొలితరం విద్యార్థులకు ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు ఉపాధ్యాయుడు. బోధన పద్ధతులు, వ్యూహాలు, బోధన ఉపకరణాల వినియోగానికి సంబంధించిన విషయాలను ఒక పద్ధతి ద్వారా పెడగాగి వివరిస్తుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునేవారికి ఈ శాస్త్రంపై అవగాహన తప్పనిసరి.

చరిత్ర

ఆధునిక యుగం అనేక మార్పులను, ఆవిష్కరణలను, జీవన విధానాలను సొంతం చేసుకుంది. విద్యా ప్రక్రియలో నూతన విధానాలను ప్రవేశపెట్టింది. బోధన, అభ్యసనలో శిశు కేంద్రీకృత పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించింది అమోస్‌ కొమినియన్‌. సైకాలజీ ఆధారిత బోధన పద్ధతులను సూచించింది హెర్బార్ట్‌ స్పెన్సర్‌. 18, 19వ శతాబ్దాలు ఈ నూతన మార్పులకు సాక్ష్యాలు.

ప్రస్తుత శిశుకేంద్ర విద్యా విధానాన్ని శాస్త్రీయంగా ప్రవేశపెట్టిన దేశం యూఎ్‌సఏ. శిశు అవసరాల దృష్ట్యా బోధన రూపకల్పనలో పెడగాగి ప్రాధాన్యం పెరిగింది. 1980వ దశకంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, మానవ వనరుల కేంద్ర మంత్రి పి.వి.నరసింహారావు ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యా విధానం శిశు కేంద్రీకృత విద్యను, కృత్యాధార కేంద్రీకృత విద్యను ప్రతిపాదించింది. ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌ ఆధ్వర్యంలో రూపొందిన ఎన్‌సీఎఫ్‌-2005 మెథడాలజీ స్థానంలో పెడగాగి ప్రవేశపెట్టాలని సూచించింది. బోధన కంటెంట్‌ లేదా విషయ విజ్ఞానానికి మెథడాలజీ ప్రాధాన్యం ఇస్తుంది. బోధన శిశువుకు పెడగాగి ప్రాధాన్యం ఇస్తుంది. 2016 నుంచి బీఈడీ, డీఈడీ సిలబస్‌లో పెడగాగిని ప్రవేశపెట్టారు.

సిలబస్‌లో ఏయే అంశాలు ఉంటాయి

దేనికదిగా ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా పెడగాగి సిలబస్‌ ఉంటుంది. అంటే మేథ్స్‌, సైన్స్‌, సోషల్‌, తెలుగు, ఇంగ్లీష్‌ ప్రత్యేక పెడగాగి సిలబ్‌సను కలిగి ఉంటాయి. సైన్స్‌లో బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ దేనికదే ప్రత్యేక సిలబ్‌సను కలిగి ఉంటాయి. ఈ పెడగాగి సిలబ్‌సలో సబ్జెక్ట్‌ ఓరియంటేషన్‌ బోధన విధానాలు ఉంటాయి. వాటితో పాటుగా మొత్తం పెడగాగీలలో ఉండే కామన్‌ అంశాలు అంతరార్థాలుగా ఉంటాయి. ప్రతి పెడగాగీలో 10 యూనిట్లను పొందుపరిచారు. అవి కింది విధంగా ఉన్నాయి.

మొదటి యూనిట్‌: సబ్జెక్ట్స్‌కు చెందిన చారిత్రక పరిణామక్రమ పరిధి, స్వభావం, నిర్వచనాలు మొదలైన అంశాలతోపాటు ఆ సబ్జెక్ట్స్‌ విస్తృతిలో భాగస్వామ్యం అయిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తల వివరాలు ఈ యూనిట్‌లో అంతర్భాగాలు. అభ్యర్థులకు ఈ యూనిట్‌ సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి పునాదిగా ఉపయోగపడుతుంది.

రెండో యూనిట్‌: విలువలు - ఆశయాలు- లక్ష్యాలు-స్పష్టీకరణలు ఈ యూనిట్‌ సారాంశం. 1948లో యూఎ్‌సఏలో మానసిక శాస్త్రవేత్తల సమావేశ తీర్మానాల ప్రాతిపదికగా ‘బెంజిమన్‌ బ్లూమ్స్‌’ ప్రవర్తన మేధో సంబంధిత, భావావేశ, మనో చలనాత్మక రంగాల సమన్వయంగా రూపొందించాడు. ప్రతి సబ్జెక్టు బోధనలో ఈ లక్ష్యాల సాధన అంశాలు ఉంటాయి.

మూడో యూనిట్‌: బోధనలో మనోవిజ్ఞాన శాస్త్రం లేదా సైకాలజీ వినియోగం ఈ యూనిట్‌ లక్ష్యం. ప్రవర్తన వాదం, సంజ్ఞానాత్మకవాదం, గెస్టాల్ట్‌ వాదాలు, మానవీయ వాదాలు వివిధ అభ్యసన సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. వీటిద్వారా బోధన ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలో ఈ యూనిట్‌ తెలియజేస్తుంది.

నాలుగో యూనిట్‌: ఈ యూనిట్‌ కరికులం లేదా విద్యా ప్రణాళిక నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి అంశాలను వివరిస్తుంది. టీచర్‌, లెక్చరర్స్‌ జాబ్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు ఈ యూనిట్‌ విస్తృత జ్ఞానం ఇస్తుంది.

ఐదో యూనిట్‌: అతి ముఖ్యమైన యూనిట్‌ ఇది. ఉపగమనాలు, పద్ధతులు, ఇతర బోధన విస్తరణ అంశాలు ఉన్నాయి. ఈ చాప్టర్‌ను కంటెంట్‌ వివరణలో భాగంగా చూడాలి.

ఆరో యూనిట్‌: ఈ యూనిట్‌ పాఠ్య ప్రణాళిక లేదా లెస్సన్‌ ప్లాన్‌, యూనిట్‌ ప్లాన్‌, ఇయర్‌ ప్లాన్‌ పద్ధతులను వివరిస్తుంది. టీచింగ్‌ ప్రాక్టీస్‌ అనుభవాలు ఈ యూనిట్‌ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

ఏడో యూనిట్‌: ఈ యూనిట్‌ వనరుల నిర్వహణకు సంబంధించింది. వనరుల గుర్తింపు, తయారీ, ప్రయోగశాలలు, ఐసీటీ మొదలైన అంశాలపై అవగాహన ఈ యూనిట్‌లో అంతర్భాగం.

ఎనిమిదో యూనిట్‌: ఈ యూనిట్‌ మూల్యాంకనానికి సంబంధించింది. మాపనం, పరీక్ష, మూల్యాంకనం తదితర అంశాలు, నిర్దేశించే సూత్రాలు దీనిలో అంతర్భాగం. నిరంతర సమగ్ర మూల్యాంకనం లేదా సీసీఈని ఈ యూనిట్‌లో ప్రత్యేక కోణంలో చూడాలి.

తొమ్మిదో యూనిట్‌: ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు సంబంధిత బోధన యూనిట్‌, సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్య విషయాలు దీనిలో అంతర్భాగం.

పదో యూనిట్‌: రోజువారీ జీవితంలో మన సబ్జెక్టు ఏ మేరకు ఉపయోగపడుతుందో ఈ యూనిట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. లైఫ్‌లాంగ్‌ ఎడ్యుకేషన్‌ కోణంలో ఈ యూనిట్‌ను చదవాలి.

ప్రిపరేషన్‌

గురుకుల్‌ టీచర్స్‌ జాబ్స్‌, లెక్చరర్స్‌ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు కింది సూచనల ఆధారంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి.

  • సిలబ్‌సను అర్థం చేసుకోండి. అందుకోసం నాలుగు నుంచి ఐదు సార్లు సిలబ్‌సను చదవండి. తెలిసిన అంశాలు, తెలియని విషయాలను వర్గీకరణ చేసుకోండి.

  • సిలబస్‌ ఆధారిత పుస్తకాలను సేకరించి చదవండి. ప్రామాణిక పుస్తకాలను మాత్రమే చదవండి. స్వీయ నోట్స్‌ సిద్ధం చేసుకోండి.

  • గత పరీక్షల ప్రశ్న పత్రాలను సేకరించండి. ప్రశ్నల సరళిని విశ్లేషించండి. మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలరో గుర్తించండి.

  • ఒక సబ్జెక్టుకు సంబంధించిన అభ్యర్థులు ఒకే గ్రూప్‌గా ఏర్పడి, ఉమ్మడిగా చర్చించండి. నిరంతరం పరీక్ష వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు వహించండి.

Model Questions

1. The Pedagagy follows the approach of

A. Knowledge Transfer

B. Knowledge Constructiion

C. Knowledge Imposition

D. Above All

2. "Teacher is a Duty Minded and Subject Oriented" comes under..

A. Understanding B. Application

C. Attitude D. Skill

3. What is learning difficulty

A.Reading Problems B. Writing Problems

C. Problems of Understanding Mathemetics

D. Above All

4. What is not a quality of best question paper

A.Validity B. Reliability

C. Objectivity D. Predictability

5. Life long education consists with

A. Formal B. Informal C. Non Formal D. Above all

Answers: 1) B, 2) C, 3) D, 4) D, 5) D

Updated Date - 2023-05-22T13:49:32+05:30 IST