టెన్త్ ఉత్తీర్ణతతో కేంద్ర హోంశాఖలో కానిస్టేబుల్ పోస్టులు
ABN , First Publish Date - 2023-07-01T12:18:50+05:30 IST
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)... కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు 458
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)... కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కానిస్టేబుల్(డ్రైవర్) గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్): 458 పోస్టులు(యూఆర్-195, ఎస్సీ-74, ఎస్టీ-37, ఓబీసీ-110, ఈడబ్ల్యూఎస్-42)
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూ డేళ్లు, ఎక్స్ సర్వీ్‌సమన్(యూఆర్/జనరల్) అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్‌సర్వీ్‌స్‌మన్(ఓబీసీ)లకు ఆరేళ్లు, ఎక్స్ సర్వీ్‌సమన్(ఎస్సీ/ఎస్టీ)లకు ఎనిమిదేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎ్‌సటీ), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 26
వెబ్‌సైట్: recruitment.itbpolice.nic.in/