Postal jobs: టెన్త్ ఉత్తీర్ణతతో తపాల శాఖలో పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!

ABN , First Publish Date - 2023-02-01T16:00:26+05:30 IST

దేశ వ్యాప్తంగా (India) వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్‌ (Gramina dak sevak) (జీడీఎస్‌) (GDS) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.

Postal jobs: టెన్త్ ఉత్తీర్ణతతో తపాల శాఖలో పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!

ఖాళీలు 40,889

దేశ వ్యాప్తంగా (India) వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్‌ (Gramina dak sevak) (జీడీఎస్‌) (GDS) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో 2480, తెలంగాణ (Telangana)లో 1266 ఖాళీలున్నాయి.

పోస్టులు: గ్రామీణ డాక్‌ సేవక్స్‌ - బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (Branch Postmaster)/అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (Assistant Branch Postmaster)/డాక్‌ సేవక్‌

సర్కిల్‌ వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌-2480, అసోం-407, బిహార్‌-1461, ఛత్తీస్‌గఢ్‌-1593, ఢిల్లీ-46, గుజరాత్‌-2017, హరియాణా-354, హిమాచల్‌ప్రదేశ్‌-603, జమ్మూ కశ్మీర్‌-300, ఝార్ఖండ్‌-1590, కర్ణాటక-3036, కేరళ-2462, మధ్యప్రదేశ్‌-1841, మహారాష్ట్ర-2508, నార్త్‌ ఈస్టర్న్‌-923, ఒడిషా-1382, పంజాబ్‌ -766, రాజస్థాన్‌-1684, తమిళనాడు-3167, తెలంగాణ-1266, ఉత్తరప్రదేశ్‌-7987, ఉత్తరాఖండ్‌-889, పశ్చిమ బెంగాల్‌-2127

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మేథ్స్‌, ఇంగ్లీష్‌, స్థానిక భాష సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైక్కిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

వయసు: 2023 ఫిబ్రవరి 16 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్వాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు లభిస్తుంది.

జీతభత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000-రూ.29,380; ఏబీపీఎం/డాక్‌ సేవక్‌ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: ఫిబ్రవరి 16

వెబ్‌సైట్‌: indiapostgdsonline.gov.in/

Updated Date - 2023-02-01T16:02:02+05:30 IST