CISFలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ.. ఎన్నంటే..!
ABN , First Publish Date - 2023-02-16T14:30:41+05:30 IST
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force) (సీఐఎస్‌ఎఫ్).... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force) (సీఐఎస్‌ఎఫ్).... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 451(యూఆర్-187, ఎస్సీ-67, ఎస్టీ-32, ఓబీసీ-121, ఈడబ్ల్యూఎస్-26)
పోస్టుల వివరాలు:
1. కానిస్టేబుల్ (Constable)/డ్రైవర్ (Driver): 183 పోస్టులు (యూఆర్-76, ఎస్సీ-27, ఎస్టీ-13, ఓబీసీ-49, ఈడబ్ల్యూఎస్-18)
2. కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్): 268 పోస్టులు (యూఆర్-111, ఎస్సీ-40, ఎస్టీ-19, ఓబీసీ-72, ఈడబ్ల్యూఎస్-26)
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) (హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్; లైట్ మోటార్ వెహికల్; మోటార్ సైకిల్ విత్ గేర్)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.21,700- రూ.69,100
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్ట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22
వెబ్‌సైట్: cisfrectt.in/index.php
ఇది కూడా చదవండి: అనారోగ్యంతో భర్త చనిపోయాడని ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. ఏ రోగం లేకపోయినా ఎలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!