Inter Exams: వంద శాతం సిలబస్‌‌తో ప్రశ్నలు! ప్రైవేటు కాలేజీలు అలా చేయొద్దన్న మంత్రి!

ABN , First Publish Date - 2023-03-14T11:45:42+05:30 IST

ఇంటర్‌ వార్షిక పరీక్షల (Inter Exams) నిర్వహణకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి జరిగే పరీక్షల కోసం 1,473 కేంద్రాలను సిద్ధం చేసింది. ఫస్టియర్‌లో 4,82,677 మంది, సెకండియర్‌లో 4,65,022 మంది.. మొత్తం 9,47,699 మంది

Inter Exams: వంద శాతం సిలబస్‌‌తో ప్రశ్నలు! ప్రైవేటు కాలేజీలు అలా చేయొద్దన్న మంత్రి!
ఒత్తిడి వద్దు

బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు

హాజరుకానున్న 9,47,699 మంది విద్యార్థులు

1,473 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

విద్యార్థులూ.. ఒత్తిడి వద్దు

మంత్రి సబిత ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ వార్షిక పరీక్షల (Inter Exams) నిర్వహణకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి జరిగే పరీక్షల కోసం 1,473 కేంద్రాలను సిద్ధం చేసింది. ఫస్టియర్‌లో 4,82,677 మంది, సెకండియర్‌లో 4,65,022 మంది.. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్‌ 4న ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది నుంచి 100% సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడగనున్నారు. 614 ప్రభుత్వ కాలేజీలు, 859 ప్రైవేట్‌ కాలేజీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, 200 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఆన్సర్‌ బుక్స్‌ను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ హైపవర్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను పెట్టారు. ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సహాయం కోసం 040-24601010, 040-24655027 నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు రావాలి.

ఒత్తిడి వద్దు: మంత్రి సబిత

ఇంటర్‌ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) ప్రకటించారు. విద్యార్థులు ఒత్తిడి, భయానికి లోనుకాకుండా పరీక్షలను రాయాలని సూచించారు. పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఆమె సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలతో పాటు, అధ్యాపకులు, తల్లిదండ్రులపైన కూడా ఉందని చెప్పారు.

Updated Date - 2023-03-14T11:45:42+05:30 IST