Share News

Almonds: నానబెట్టిన vs నానబెట్టని బాదం.. రెండింటీలో ఏదీ బెస్ట్.. తెలియాలంటే ఇది చదవండి!

ABN , First Publish Date - 2023-12-10T11:47:35+05:30 IST

Benefits of Almonds: బాదం పప్పు పోషకాల గని అనే విషయం అందిరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే బాదంను పోషకాహార పవర్‌హౌస్‌గా పేర్కొంటారు. దీనికి కారణం వాటిలో పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండడమే. ఇక బాదం అనేది సహాజంగానే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ E, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, భాస్వరం ఇలా శరీరానికి కావాల్సిన అత్యావశ్యక మూలకాలను కలిగి ఉంటుంది.

Almonds: నానబెట్టిన vs నానబెట్టని బాదం.. రెండింటీలో ఏదీ బెస్ట్.. తెలియాలంటే ఇది చదవండి!

Benefits of Almonds: బాదం పప్పు పోషకాల గని అనే విషయం అందిరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే బాదంను పోషకాహార పవర్‌హౌస్‌గా పేర్కొంటారు. దీనికి కారణం వాటిలో పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండడమే. ఇక బాదం అనేది సహాజంగానే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ E, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, భాస్వరం ఇలా శరీరానికి కావాల్సిన అత్యావశ్యక మూలకాలను కలిగి ఉంటుంది. కాగా, ఈ పోషకాహార పవర్‌హౌస్‌ బరువు తగ్గడానికి, బలమైన ఎముకల ఆరోగ్యం, మెరుగైన మానసిక స్థితి, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో దోహదపడతాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నానబెట్టిన, నానబెట్టని బాదం.. ఈ రెండింటీలో శరీరానికి ఏది మంచిది. దేనివల్ల శరీరానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు ఈ రెండింటీలో ఏది బెస్ట్ అనే విషయం తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Tomato: అంతరిక్షంలో కనిపించకుండాపోయిన టమాటా.. 8 నెలల తర్వాత దొరికింది.. అసలేం జరిగిందంటే..!

నానబెట్టిన బాదం ఎందుకు మంచిదంటే..

మెరుగైన డైజెస్టిబిలిటీ: నానబెట్టిన బాదంపప్పులు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నానబెట్టడం వల్ల పప్పు మృదువుగా తయారవుతుంది. తద్వారా వాటిని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది.

మెరుగైన పోషకాల లభ్యత: బాదంపప్పును నానబెట్టడం వల్ల పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల లభ్యత పెరుగుతుంది. ఈ ప్రక్రియ లైపేస్ వంటి ఎంజైమ్‌లను విడుదల చేయడం, జీవక్రియను పెంచడం, బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా పోషకాల శోషణకు ఆటంకం కలిగించే మలినాలను కూడా తొలగిస్తుంది.

ఫైటిక్ యాసిడ్ తగ్గింపు: బాదంపప్పును నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. ఇది కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగించే యాంటీ న్యూట్రియంట్ నానబెట్టడం ద్వారా ఈ ఖనిజాలు మరింత సలువుగా లభ్యమవుతాయి.

యాంటీఆక్సిడెంట్ యాక్టివేషన్: బాదంపప్పును నానబెట్టడం వల్ల బాదం తొక్కలో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు యాక్టివేట్ అవుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మొత్తం సెల్యులార్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇది కూడా చదవండి: Viral Video: విద్యార్థినిలతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!


బరువు తగ్గడానికి కావాల్సిన ఎంజైమ్ విడుదల: బాదంను నానబెట్టడం వల్ల లిపేస్‌తో సహా ఇతర ఎంజైమ్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇక కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో లిపేస్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే నానబెట్టిన బాదం మెరుగైన జీవక్రియకు దోహదం చేస్తుంది. ఇది బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది.

బాదంపై మలినాల తొలగింపు: బాదములను నానబెట్టడం వల్ల వాటిపై ఉండే మలినాలు శుభ్రమవుతాయి. అప్పుడు వాటిని పొట్టుతో సహా తినడం వల్ల శరీరానికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

భాస్వరం అన్‌లాకింగ్: బాదంలో ఉండే ముఖ్యమైన ఖనిజం భాస్వరం నానబెట్టిన తర్వాత మరింత సమృద్ధిగా లభిస్తుంది. ఇలా అధిక మోతాదులో భాస్వరం లభ్యత అనేది ఎముకల ఆరోగ్యం, దంత సంరక్షణతో పాటు వివిధ శారీరక విధులకు దోహదం చేస్తుంది.

యాంటీ-న్యూట్రియెంట్ ఇంపాక్ట్ తగ్గుతుంది: బాదంపప్పును నానబెట్టడం వల్ల బాదం పొట్టులో ఉండే టానిన్లు, ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ-న్యూట్రియంట్స్ ప్రభావం తగ్గుతుంది. ఈ సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉన్నప్పుడు అవసరమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. నానబెట్టడం వల్ల వాటి ప్రభావం తగ్గుతుంది కనుక ఖనిజాల శోషణ ఈజీ అవుతుంది. ఇలా నానబెట్టిన బాదం వల్ల పలు ప్రయోజనాలు అదనంగా చేకూరుతాయి. అందుకే నానబెట్టని బాదంపప్పు కంటే నానబెట్టిన బాదం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Updated Date - 2023-12-10T11:48:48+05:30 IST