భార్య ప్రతి రోజూ ఇచ్చే కాఫీ రుచిలో ఏదో తేడా.. అనుమానంతో కెమెరా పెట్టిన భర్త.. అసలు విషయం తెలిసి షాక్!.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-07T13:23:09+05:30 IST

భర్తను చంపేందుకు ఓ భార్య మాష్టర్ ప్లాన్ వేసింది. ఇందుకోసం భర్త తాగే కాఫీలో రోజూ కొద్ది మొత్తంలో విషం పదార్థాలు కలిపి ఇచ్చింది. అనుమానం వచ్చిన భర్త రహస్యంగా కెమెరాను పెట్టి చిత్రీకరించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు.

భార్య ప్రతి రోజూ ఇచ్చే కాఫీ రుచిలో ఏదో తేడా.. అనుమానంతో కెమెరా పెట్టిన భర్త.. అసలు విషయం తెలిసి షాక్!.. అసలు ఏం జరిగిందంటే..?

భర్తను చంపేందుకు ఓ భార్య మాష్టర్ ప్లాన్ వేసింది. ఇందుకోసం తాగే కాఫీలో రోజూ కొద్ది మొత్తంలో విషం పదార్థాలు కలిపి ఇచ్చింది. అనుమానం వచ్చిన భర్త రహస్యంగా కెమెరాను పెట్టి చిత్రీకరించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు. భర్త ఇచ్చిన వీడియో పుటేజీ ఆధారంగా భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై హత్యకు ప్రయత్నించడం, తీవ్రమైన దాడికి ప్రయత్నించడం, ఆహారం లేదా పానీయాల్లో విషం కలపడం వంటి వాటిపై కేసు నమెదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూఎస్‌ఏలోని అరిజోనా రాష్ట్రంలో గల టెక్సస్‌లో 34 ఏళ్ల మెలోడీ ఫెలికానో జాన్సన్, రాబీ జాన్సన్ అనే భార్యభర్తలు జీవిస్తున్నారు. రాబీ జాన్సన్ యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. అయితే 2023 మార్చిలో భార్యభర్తలిద్దరూ జర్మనీలో ఉన్నారు. ఆ సమయంలో భార్య మెలోడీ జాన్సన్ ఇచ్చే కాఫీ రుచిలో ఏదో తేడా ఉండడాన్ని భర్త రాబీ జాన్సన్ గుర్తించాడు.


కాఫీ రుచి చెడుగా ఉందని భావించాడు. దీంతో అనుమానం వచ్చిన రాబీ జాన్సన్ పూల్ టెస్టింగ్ స్ట్రిప్స్‌ను ఉపయోగించి తాను తాగే కాఫీలో క్లోరిన్ స్థాయి అధికంగా ఉందని గుర్తించాడు. నిజాన్ని వెలికి తీసేందుకు తమ వంట గదిలో భార్య మెలోడీ జాన్సన్‌కు తెలియకుండా రాబీ జాన్సన్ రహస్య కెమెరాను అమర్చాడు. ఆ తర్వాత వీడియోలో రికార్డు అయింది చూసి సదరు భర్త ఖంగుతిన్నాడు. వీడియోలో మెలోడీ జాన్సన్ కాఫీ తయారు చేసే సమయంలో ఏదో తెలియని పదార్థాన్ని కలపడాన్ని రాబీ జాన్సన్ గుర్తించాడు. ఆ తర్వాత మరిన్ని కెమెరాలను అమర్చాడు. భార్యను పట్టుకోవడానికి తగిన సాక్ష్యాధారాలను సేకరించాడు. అయితే భార్యను వెంటనే పట్టుకోకుండా ఆమె ఇచ్చిన కాఫీని తాగుతున్నట్టు నటించాడు.

జూలైలో యూఎస్‌లోని మోంథన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా కెమెరాలను పెట్టి కాఫీ తయారు చేసే క్రమంలో భార్య విషపదార్థాలను కలపడాన్ని గుర్తించాడు. దీంతో తగిన సాక్ష్యాధారాలతో రాబీ జాన్సన్ పోలీసులను ఆశ్రయించాడు. రాబీ జాన్సన్ ఇచ్చిన ఫిర్యాదు, సాక్ష్యాధారాల ఆధారంగా మెలోడీ జాన్సన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. శుక్రవారం జరిగిన విచారణలో మెలోడీ జాన్సన్ దోషిగా తేలింది. కాగా భర్త చనిపోయాక వచ్చే ప్రయోజనాల కోసం ఆమె ఇలా చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మెలోడీ జాన్సన్ సెప్టెంబర్ 6న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కాగా మెలోడీ జాన్సన్ ఇటీవల ఫీలీప్పీన్స్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. దీంతో ఆమె దేశం నుంచి పారిపోయే ప్రమాదం ఉందని ప్రాసిక్యూటర్లు కోర్టులో వాదించారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఆమెను పిమా కౌంటీ జైలులో ఉంచారు.

Updated Date - 2023-08-07T13:25:53+05:30 IST