2024 Lok Sabha elections : మా ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ : అశోక్ గెహ్లాట్
ABN , First Publish Date - 2023-08-27T09:52:16+05:30 IST
రానున్న లోక్ సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా (I.N.D.I.A) కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
న్యూఢిల్లీ : రానున్న లోక్ సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా (I.N.D.I.A) కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ, ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు.
అశోక్ గెహ్లాట్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, రానున్న లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా (I.N.D.I.A) కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాల ప్రభావం ఉంటుందన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం అన్ని పార్టీలపైనా తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. ప్రజలు అలాంటి ఒత్తిడిని సృష్టించారన్నారు. అందుకే అన్ని పార్టీలతో ఓ కూటమి ఏర్పాటైందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దురహంకారి కాకూడదన్నారు. బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. మిగిలిన 69 శాతం మంది ఆయనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఇండియా కూటమి బెంగళూరులో సమావేశమైన తర్వాత ఎన్డీయే భయపడుతోందన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో విజయం సాధించడం కోసం ఎన్డీయే కృషి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించినపుడు అశోక్ గెహ్లాట్ సమాధానం చెప్తూ, మోదీ దానిని ఎన్నడూ సాధించలేరన్నారు. మోదీకి ప్రజాదరణ అత్యధికంగా ఉన్నపుడే ఆ స్థాయిలో ఓట్లు ఆయనకు రాలేదన్నారు. ఆయనకు ఓట్లు తగ్గుతాయని, 2024 ఎన్నికల ఫలితాలు ప్రధాన మంత్రి ఎవరు అవుతారో నిర్ణయిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లే 2014లో మోదీ ప్రధాన మంత్రి అయ్యారన్నారు. మోదీ మాట తీరును అశోక్ గెహ్లాట్ దుయ్యబట్టారు. భవిష్యత్తు గురించి జోస్యం చెప్పడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు.
నెహ్రూ, ఇందిరల కృషితోనే..
చంద్రయాన్-3 విజయం గురించి ప్రస్తావిస్తూ, మాజీ ప్రధాన మంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల కృషి చాలా ముఖ్యమైనదని తెలిపారు. వారి కఠోర శ్రమ వల్లే నేడు విజయాలు లభిస్తున్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Ilayaraja, DSP: ఇళయరాజా ఆశీస్సులు అందుకున్న దేవిశ్రీప్రసాద్
LTTE: తమిళనాడులో మళ్లీ ఎల్టీటీఈ కదలికలు?