Urmila Matondkar: భారత్ జోడో యాత్రలో సినీనటి ఉర్మిళ మతోండ్కర్

ABN , First Publish Date - 2023-01-24T12:42:26+05:30 IST

రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి ఉర్మిళ మతోండ్కర్ మంగళవారం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట...

Urmila Matondkar: భారత్ జోడో యాత్రలో సినీనటి ఉర్మిళ మతోండ్కర్
Urmila Matondkar Joins Rahul Yatra

జమ్మూ: రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి ఉర్మిళ మతోండ్కర్ మంగళవారం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట పాల్గొన్నారు.(Urmila Matondkar)కట్టుదిట్టమైన భద్రత మధ్య మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్మీ గార్రిసన్ దగ్గర నుంచి మార్చ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉర్మిళ మతోండ్కర్ రాహుల్ గాంధీతో(Rahul Gandhi) చేరారు. రాహుల్ యాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. 2019లో కాంగ్రెస్ చేరిన ఉర్మిళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2020లో శివసేన తీర్థం స్వీకరించారు.

క్రీమ్-కలర్ సంప్రదాయ కాశ్మీర్ గౌను, బీనీక్యాప్ ధరించి రాహుల్ వెంట నడిచారు. ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ కర్రా కూడా చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని రాహుల్ వెంట నడిచారు.సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర( Bharat Jodo Yatra) గురువారం పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించింది. మంగళవారం గార్రిసన్ నగరానికి చేరుకుంది.కాశ్మీరీ పండిట్ వలస మహిళల బృందం వారి సంప్రదాయ దుస్తులు ధరించి పూల రేకులతో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.

Updated Date - 2023-01-24T12:47:49+05:30 IST