Share News

Adani Gruoup: మాకెలాంటి సంబంధం లేదు.. ఉత్తర్‌కాశీ టన్నెల్‌పై అదానీ గ్రూప్ వివరణ

ABN , First Publish Date - 2023-11-27T17:04:18+05:30 IST

ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్ సోమవారంనాడు తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చింది.

Adani Gruoup: మాకెలాంటి సంబంధం లేదు.. ఉత్తర్‌కాశీ టన్నెల్‌పై అదానీ గ్రూప్ వివరణ

అహ్మదాబాద్: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగం (Tunnel)లో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్ (Adani Group) సోమవారంనాడు తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చింది. ఈ ఘటనను తమ గ్రూప్‌తో ముడిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో అదానీ గ్రూప్‌, దాని అనుబంధ సంస్థలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమేయం లేదని వివరించింది.


''ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలడం దురదృష్టకరం. ఈ ఘటనకు మా సంస్థతో ముడిపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ టన్నెల్‌ను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. ఆ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అందులో మాకు షేర్లు కూడా లేవు'' అని అదాని గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు, వారి కుటుంబాలకు మంచి జరగాలని తాము ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో కొంత భాగం కుప్పకూలడంతో అందులో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.

Updated Date - 2023-11-27T17:04:20+05:30 IST