Biparjoy : బిపర్‌జోయ్ తుపాను.. కోలుకుంటున్న గుజరాత్‌లోని కచ్ ప్రాంతం..

ABN , First Publish Date - 2023-06-17T13:55:39+05:30 IST

బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) సృష్టించిన సమస్యల నుంచి గుజరాత్‌లోని కచ్ జిల్లా కోలుకుంటోంది. శనివారం ఉదయం ఈ ప్రాంతంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు తమ కార్యక్రమాలను పునఃప్రారంభించాయి. వందలాది గ్రామాలు, చాలా పట్టణాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.

Biparjoy : బిపర్‌జోయ్ తుపాను.. కోలుకుంటున్న గుజరాత్‌లోని కచ్ ప్రాంతం..

న్యూఢిల్లీ : బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) సృష్టించిన సమస్యల నుంచి గుజరాత్‌లోని కచ్ జిల్లా కోలుకుంటోంది. శనివారం ఉదయం ఈ ప్రాంతంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు తమ కార్యక్రమాలను పునఃప్రారంభించాయి. వందలాది గ్రామాలు, చాలా పట్టణాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఈ తుపాను జఖావూ పోర్టు సమీపంలో గురువారం సాయంత్రం తీవ్ర తుపానుగా తీరాన్ని దాటింది. అనంతరం తీవ్ర వాయుగుండంగా మారింది.

ఉత్తర గుజరాత్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరద ప్రభావిత జఖావూ, మండ్వి ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తారు. సహాయక, పునరుద్ధరణ చర్యలపై భుజ్‌లో అధికారులతో సమీక్ష జరుపుతారు. ప్రస్తుతం కచ్‌లో వర్షాలు కురవడం లేదు. గాలి వేగం కూడా తగ్గింది. రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించారు. కచ్, దేవభూమి ద్వారక, జామ్ నగర్, మోర్బి, జునాగఢ్, గిర్ సోమనాథ్, రాజ్‌కోట్, పోర్బందర్ జిల్లాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు 1,127 బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. లోతట్టు ప్రాంతాల నుంచి లక్షమందికి పైగా ప్రజలను బిపర్‌జోయ్ తుపాను నుంచి కాపాడటం కోసం సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించింది.

బిపర్‌జోయ్ తుపాను ప్రభావం కచ్‌తోపాటు దేవభూమి ద్వారక, బనస్కాంత, పటన్ జిల్లాల్లో తీవ్రంగా ఉంది. శుక్రవారం ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. బనస్కాంత, పటన్ జిల్లాల్లో శనివారం ఉదయం కూడా భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ సహాయక కమిషనర్ ఆలోక్ కుమార్ పాండే తెలిపిన వివరాల ప్రకారం ఈ తుపాను కారణంగా ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Nitish Kumar : మాంఝీపై నితీశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు

Wrestlers : రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌పై ఫొటోలు, వీడియోల సాక్ష్యాలు..

Updated Date - 2023-06-17T13:55:39+05:30 IST