Haryana clashes : హర్యానాలో మత ఘర్షణలు.. ప్రశాంతంగా ఉండాలన్న అమెరికా..
ABN , First Publish Date - 2023-08-03T09:50:41+05:30 IST
హర్యానాలోని నుహ్ జిల్లాలో జలాభిషేక యాత్రపై దుండగుల దాడి అనంతరం చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై అమెరికా స్పందించింది. హింసాత్మక చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని అన్ని పక్షాలను కోరింది.
న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో జలాభిషేక యాత్రపై దుండగుల దాడి అనంతరం చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై అమెరికా స్పందించింది. హింసాత్మక చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని అన్ని పక్షాలను కోరింది. నుహ్, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో సోమవారం నుంచి మత ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నుహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను ఈ నెల 5 వరకు తాత్కాలికంగా నిలిపేశారు.
హర్యానా ఘర్షణలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సమాధానం చెప్పారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరుతున్నట్లు తెలిపారు. హింసాత్మక చర్యలకు పాల్పడరాదని చెప్పారు. గురుగ్రామ్‌లో జరిగిన ఘర్షణల్లో అమెరికన్లు బాధితులయ్యారా? లేదా? అనే విషయం తనకు ఇంకా తెలియదన్నారు. దీని గురించి ఎంబసీ అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
విశ్వ హిందూ పరిషత్, తదితర సంస్థలు సోమవారం నిర్వహించిన జలాభిషేక యాత్రపై దుండగులు దాడి చేశారు. అనంతరం జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు హోం గార్డులు ఉన్నారు. దుండగులు పోలీస్ స్టేషన్‌పైనా, పోలీసులపైనా దాడి చేశారు. దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారు.
ఇంటర్నెట్ సేవల నిలిపివేత
నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో, గురుగ్రామ్‌లోని మూడు సబ్ డివిజన్లలో ఉద్రిక్త పరిస్థతుల నేపథ్యంలో ఈ నెల 5 వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందువల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు హర్యానా హోం శాఖ కార్యదర్శి ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాపించకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న జడ్జి, మూడేళ్ల కుమార్తె
నుహ్‌లో అమానుషంగా దాడులకు పాల్పడిన దుండగులు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంజలి జైన్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి, తగులబెట్టారు. ఆమె తన మూడేళ్ల కుమార్తె, సిబ్బందితో కలిసి ఈ కారులో ప్రయాణించారు. వీరిద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దుండగులు వీరిపై రాళ్లు రువ్వుతూ, కాల్పులు జరిపారు. వీరంతా ఓ వర్క్‌షాప్‌లో బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. కాసేపటి తర్వాత ఆ వైపు వచ్చిన కొందరు న్యాయవాదులు వారిని కాపాడారు. నుహ్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నమోదైన ఓ ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లో ఈ వివరాలను వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :
CM Manohar Lal Khattar : ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి.. నష్ట పరిహారం ఇవ్వలేం
Chennai: 6 నుంచి ఆర్థిక సాయం దరఖాస్తుల పరిశీలన