Share News

Amrit Bharat Express: వేగం, సౌకర్యం.. వెరసి 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌'

ABN , Publish Date - Dec 25 , 2023 | 05:45 PM

సామాన్య ప్రజానీకం కోసం మరిన్ని సౌకర్యాలు, మరింత వేగంతో ప్రయాణించే ''అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్''ను భారత రైల్వే శరవేగంగా పట్టాల మీదుగా తీసుకువస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Amrit Bharat Express: వేగం, సౌకర్యం.. వెరసి 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌'

న్యూఢిల్లీ: సామాన్య ప్రజానీకం (Aam Aaadmi) కోసం మరిన్ని సౌకర్యాలు, మరింత వేగంతో ప్రయాణించే ''అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్'' (Amrit Bharat Express)ను భారత రైల్వే (Indian Railways) శరవేగంగా పట్టాల మీదుగా తీసుకువస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) డిసెంబర్ 30న ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే ఈ పుష్‌-పుల్ రైలు ప్రధానంగా వలస కార్మికులకు (Migrant labour force) మరింత ప్రయోజనకారిగా ఉండనుంది.


వందే సాధారణ్‌గా గతంలో పిలుచుకున్న ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వందేభారత్ తరహాలో మరింత డైనమిక్‌గా డిజైన్ చేశారు. పుష్‌పుల్ ఆపరేషన్‌ కావడంతో రైలు వేగం పెరిగి ప్రయాణ సమయం తగ్గుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 22 కోచ్‌లు ఉంటాయి. అన్‌రిజర్వ్‌డ్ పాసింజర్ల కోసం 8 జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లు, 12 సెకెండ్ క్లాస్ 3-టైర్ స్పీపర్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు తగు సదుపాయాలు ఉన్నాయి.


ప్రత్యేకతలు...

రైల్వే వర్గాల సమచారం ప్రకారం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పలు సౌకర్యాలు కల్పించారు.

-సాఫీ ప్రయాణానుభూతిని కల్పించే జెర్క్ ఫ్రీ సెమీ పెర్మనెంట్ కపులర్స్ ఏర్పాటు.

-జీరో డిశ్చార్చ్ ఎఫ్‌ఆర్‌పీ మాడ్యులర్ టాయలెట్.

-ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్

-ఇరువైపులా ఏరోడైనమిక్ డైజైన్డ్ డబ్ల్యూఏపీ5 లోకోమోటివ్‌లు.

-అధునాతన కుషన్డ్ లగేజ్ ర్యాక్.

-తేలికపాటి బరువు, మడతపెట్టేందుకు వీలున్న స్నాక్ టేబుల్

-బాటిల్ హోల్టర్, మొబైల్ చార్జర్ కోసం అవసరమైన సూటబుల్ హోల్డర్

-ఆధునిక డిజైన్‌, చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్త్‌లు

-టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్, ఎలక్ట్రికల్ క్యూబికెల్స్

-పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్‌వేలు

-రేడియంతో తళతళలాడే ఫ్రోర్లింగ్ స్ట్రిప్


చెన్నైలోని ఐసీఎఫ్‌లో తయారీ..

అమృత్ భారత్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేస్తున్నారు. నాన్-ఏసీ ప్యాసింజర్లకు మరింత చక్కటి ప్రయాణానుభూతిని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కలిగిస్తుందని ఐసీఎఫ్ జీఎం బీజీ మాల్య తెలిపారు. సీల్డ్ గ్యాంగ్‌వేలు, మెరుగైన టాయిలెట్ సౌకర్యాలు ఇందులో ఉన్నట్టు చెప్పారు.


అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రూట్లు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న రెండు 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లను ప్రారంభించే అవకాశాలున్నాయి. మొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్...యూపీలోని అయోధ్య నుంచి బీహార్‌లోని దర్బంగా వరకూ ప్రయాణించనుంది. ఈ రెండు ప్రాంతాలు శ్రీరాముడు, సీతమ్మతో అనుబంధమున్న ప్రాంతాలు. కాగా, రెండో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ దక్షిణాదిన నడుస్తుంది. బెంగళూరు నుంచి మాల్డా రూట్‌లో ఈ రైలు ప్రయాణించనుంది.

Updated Date - Dec 25 , 2023 | 05:49 PM