Share News

Liquor policy case: ముఖ్యమంత్రికి మూడోసారి ఈడీ సమన్లు

ABN , Publish Date - Dec 22 , 2023 | 09:12 PM

లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు మూడోసారి సమన్లు పంపింది. 2024 జనవరి 3న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఇప్పటికే ఈడీ ఆయనకు రెండుసార్లు సమన్లు పంపినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు.

Liquor policy case: ముఖ్యమంత్రికి మూడోసారి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసు (Liquor policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారంనాడు మూడోసారి సమన్లు పంపింది. 2024 జనవరి 3న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఇప్పటికే ఈడీ ఆయనకు రెండుసార్లు సమన్లు పంపినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు. గురువారంనాడు ఈడీ ముందు కేజ్రీవాల్ హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం 10 రోజుల విపాసన (మెడిటేషన్) రిట్రీట్ కోసం ఒకరోజు ముందుగానే ఆయన వెళ్లిపోయారు. కాగా, మూడోసారి పంపిన్ల సమన్ల ప్రకారం జనవరి 3న కూడా ఆయన ఈడీ ముందు హాజరుకాకుంటే ఆయనపై నాన్‌- బెయిలబుల్ వారెంట్లు జారీ చేసే అవకాశాలున్నాయి.


సమన్లు చట్టవిరుద్ధం..

కాగా, ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కేజ్రీవాల్ చెబుతున్నారు. ''లీగల్‌గా వచ్చే ఏ సమన్లకైనా కట్టుబడి ఉండేదుకు సిద్ధంగా ఉన్నాను. ఈడీ సమన్లు మాత్రం గతంలో మాదిరిగానే చట్టవిరుద్ధం, రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవి. సమన్లు ఉపసంహరించుకోవాలి. నా జీవితమంతా నిజాయితీగా, జవాబుదారీతనంతోనే వ్యవహిరిస్తూ వచ్చాను. ఏదీ దాచలేదు'' అని కేజ్రీవాల్ గత సమన్లపై వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ కింద విచారణ కోసం తొలిసారి అక్టోబర్‌లో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపింది. కాగా, ఈ కేసులో సీబీఐ గత ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. అయితే గత ఏడాది ఆగస్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరును నిందితుడిగా పేర్కొనలేదు. ఇదే కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో నేత సింజయ్ సింగ్‌ ఇప్పటికే అరెస్టయ్యారు.

Updated Date - Dec 22 , 2023 | 09:27 PM