Ashok Gehlot: రాజస్థాన్‌లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ మూడు కారణాలే కీలకం
ABN , First Publish Date - 2023-11-30T20:22:11+05:30 IST
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరుణంలో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..
Rajasthan Exit Poll 2023: ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరుణంలో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఒక్క రాజస్థాన్‌లో మాత్రమే కాదని.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఇతర నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలబోదని జోస్యం చెప్పారు. తన వాదనని బలపరిచేందుకు మూడు కారణాలు కూడా ప్రస్తావించారు.
మొదటిది.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకతా లేదన్నారు. రెండోది.. ముఖ్యమంత్రి. అభివృద్ధి పనులు చేయడంలో సీఎంకి తిరుగులేదని స్వయంగా బీజేపీ ఓటర్లే చెప్తారన్నారు. మూడోది.. బీజేపీ నేతల మాటతీరు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు, ఇతర కేంద్రమంత్రులు ఉపయోగించిన భాష ఎవరికీ నచ్చలేదన్నారు. తమ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు బెదిరింపు, భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని.. దాన్ని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం ఆమోదించరని అన్నారు. అయితే.. బీజేపీకి చెందిన ‘మతం కార్డు’ వర్కవుట్ అయితే మాత్రం.. రాజస్థాన్‌లో వాళ్లు విజయం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
కాగా.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బీజేపీదే విజయమని చెప్తున్నాయి. బీజేపీకి 100 నుంచి 130 మధ్య సీట్లు రావొచ్చని.. కాంగ్రెస్‌కి 60 నుంచి 100 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలుపుతున్నాయి. మొత్తం 200 స్థానాలు కలిగిన రాజస్థాన్‌లో అత్యధిక సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని, తద్వారా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ జోస్యం చెప్తున్నాయి. మరి.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయో? లేక అశోక్ గెహ్లాట్ నమ్మకం నిజం అవుతుందో? డిసెంబర్ 3వ తేదీన తేలిపోనుంది. ఇంతకీ రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ పలితాలు ఎలా ఉన్నాయంటే..
ఏపీబీ - సీ ఓటర్
బీజేపీ: 94-114
కాంగ్రెస్: 71-91
బీఎస్పీ: 0
ఇతరులు: 9-19
దైనిక్ భాస్కర్
బీజేపీ: 98-105
కాంగ్రెస్: 85-95
బీఎస్పీ: 0
ఇతరులు: 10-15
ఇండియా టుడే - ఆక్సిస్ మై ఇండియా
బీజేపీ: 80-100
కాంగ్రెస్: 86-106
బీఎస్పీ: 1-2
ఇతరులు: 8-16
ఇండియా టీవీ - సీఎన్ఎక్స్
బీజేపీ: 80-90
కాంగ్రెస్: 94-104
బీఎస్పీ: 0
ఇతరులు: 14-18
జన్ కీ బాత్
బీజేపీ: 100-122
కాంగ్రెస్: 62-85
బీఎస్పీ: 0
ఇతరులు: 14-15
పీ-మార్క్ క్యూ
బీజేపీ: 105-125
కాంగ్రెస్: 69-91
బీఎస్పీ: 0
ఇతరులు: 5-15
రిపబ్లిక్ టీవీ - మేట్రిజ్
బీజేపీ: 115-130
కాంగ్రెస్: 65-75
బీఎస్పీ: 0
ఇతరులు: 12-19
టైమ్స్ నౌ - ఈటీజీ
బీజేపీ: 108-128
కాంగ్రెస్: 56-72
బీఎస్పీ: 0
ఇతరులు: 13-21
టీవీ9 భారత్‌వర్ష్ - పోల్‌స్ట్రాట్
బీజేపీ: 100-110
కాంగ్రెస్: 90-100
బీఎస్పీ: 0
ఇతరులు: 05-15