Ballary: చంద్రబాబు అరెస్టు దారుణం

ABN , First Publish Date - 2023-09-23T11:29:04+05:30 IST

చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని బళ్లారి తుంగభద్ర సోషియల్‌ అండ్‌ కల్చరల్‌ అసోషియేషన్‌ కార్యదర్శి ఎంఆర్‌ఆర్‌ ప్రసాద్‌(MRR Prasad) పేర్కొన్నారు.

Ballary: చంద్రబాబు అరెస్టు  దారుణం

- తుంగభద్ర సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎంఆర్‌ఆర్‌ ప్రసాద్‌

బళ్లారి సిటీ(బెంగళూరు): చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని బళ్లారి తుంగభద్ర సోషియల్‌ అండ్‌ కల్చరల్‌ అసోషియేషన్‌ కార్యదర్శి ఎంఆర్‌ఆర్‌ ప్రసాద్‌(MRR Prasad) పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ బళ్లారి, కంప్లి, గంగావతి, హొసపేట, సింధనూరు తదితర ప్రాంతాల నుంచి తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు, సానుబూతి పరులు గురువారం సిరుగుప్పలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా ఎంఆర్‌ఆర్‌. ప్రసాద్‌ మాట్లాడుతూ సాంకేతికంగా హైదరాబాద్‌ను దేశానికే తల మానికం గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబునాయుడుదని, సాంకేతికతతో ఎంతో మందికి ఉపాది కల్పించడం, ఆయన సాధించిన ప్రగతికి నిదర్శనమన్నారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొవాలి కాని ఈ రకంగా వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. ర్యాలీలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, కమ్మసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

pandu4.2.jpg

Updated Date - 2023-09-23T11:30:18+05:30 IST