Vinayaka Chavithi Special Trains: వినాయక చవితికి స్పెషల్ రైళ్ళు వచ్చేస్తున్నాయి.. ఇక ఇబ్బందులు తప్పినట్లే!

ABN , First Publish Date - 2023-06-27T16:54:23+05:30 IST

వినాయక చవితి నేపథ్యంలో ముంబైలో ఇండియన్ రైల్వేస్ (Indian Railways) 156 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకోని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.

Vinayaka Chavithi Special Trains: వినాయక చవితికి స్పెషల్ రైళ్ళు వచ్చేస్తున్నాయి.. ఇక ఇబ్బందులు తప్పినట్లే!

వినాయకచవితి (Ganesh Chaturthi) వస్తుందంటే చాలు అందరికీ ఎక్కడా లేని సంతోషం పుట్టుకువస్తుంది. అదే సమయంలో పట్టణాలు, నగరాలలో ఉండే వాళ్ళలో చాలా మందికి ఒక భయం కూడా ఉంటుంది. అదేంటంటే వీధులన్నీ వినాయక మండపాలతో నిండిపోవడంతో బయటికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. చాలా దారులు మూసివేయడం వల్ల, ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా అవుతుంటాయి. దీంతో రైళ్లలో ప్రయాణించడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. అయితే మెజారిటీ ప్రయాణికులు రైళ్లనే ఆశ్రయిస్తుండడంతో అక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన ఇండియన్ రైల్వేస్ ముంబై వాసులకు ఒక శుభవార్త చెప్పింది.

అదేటంటే.. వినాయక చవితి నేపథ్యంలో ముంబైలో ఇండియన్ రైల్వేస్ (Indian Railways) 156 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకోని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ముంబై కొంకణ్‌ ప్రాంతాల మధ్య సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభంకానున్నాయి. కాగా వినాయక చవితిని సెప్టెంబర్ 19న నిర్వహించనున్నారు.

Updated Date - 2023-06-27T16:54:23+05:30 IST